Sunita Williams : సునీత విలియమ్స్‌ వచ్చేస్తోంది.. భూమిపైకి ల్యాండ్ అవుతోంది చూడండి.. లైవ్ వీడియో ఇదిగో..!

Sunita Williams : భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమిపైకి ల్యాండ్ అవుతోంది.

Sunita Williams _ nasa spacex crew9 reentry and splashdown ( Image source : NASA Youtube )

Sunita Williams : ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తు్న్న నాసా వ్యోమగామి, భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమిపైకి ల్యాండ్ అవుతోంది. వారం రోజుల అంతరిక్ష యాత్ర కోసం వెళ్లిన సునీత దాదాపు 9 నెలలు అక్కడే ఉండాల్సి వచ్చింది. ఎట్టకేలకు సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ భూమిపైకి అడుగుపెడుతోంది.

సునీతతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు భూ వాతావరణంలోకి అడుగుపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి నాసా లైవ్ వీడియోను ప్రసారం చేస్తోంది. అంతరిక్షం నుంచి బయల్దేరిన స్పేస్‌ఎక్స్‌ క్రూడ్రాగన్‌ వ్యోమనౌక భారత కాలమానం ప్రకారం మార్చి 19 (బుధవారం) తెల్లవారుజామున 3.27కు భూమికి సురక్షితంగా చేరుకోనున్నారు. షెడ్యూల్ ప్రకారం.. మార్చి 18న ఉదయం 10.15కి ప్రయాణం ప్రయాణం మొదలుకాగా, 17 గంటలపాటు ప్రయాణించి ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో మరికొద్ది క్షణాల్లో ల్యాండ్‌ కానున్నారు.

Read Also : Sunita Williams : సునీత విలియమ్స్ కోసం కుటుంబం ప్రార్థనలు.. సురక్షితంగా చేరుకోవాలంటూ ఆ గ్రామంలో యజ్ఞాలు!

నాసాకు చెందిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ తిరిగి రావడానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఆమెతో పాటు బుచ్ విల్మోర్ కూడా తిరిగి వస్తున్నాడు. ఈ ఇద్దరు నాసా వ్యోమగాములు కేవలం 8 రోజుల మిషన్‌ కోసం అంతరిక్షానికి వెళ్లారు. అయితే, తొమ్మిది నెలల 13 రోజులు ఒంటరిగానే ఉండిపోయారు.

ఇప్పుడు స్పేస్‌ఎక్స్ అంతరిక్ష నౌక అంతరిక్షంలో చిక్కుకున్న నాసా వ్యోమగాములతో భూమికి బయలుదేరింది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఈ అంతరిక్ష నౌక ఫ్లోరిడా తీరంలో దిగనుంది. ప్రపంచం సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ పునరాగమనాన్ని ఆసక్తిగా చూస్తోంది.