Sunita Williams : సునీత విలియమ్స్ కోసం కుటుంబం ప్రార్థనలు.. సురక్షితంగా చేరుకోవాలంటూ ఆ గ్రామంలో యజ్ఞాలు!
Sunita Williams : గుజరాత్‌లోని ఆమె కుటుంబం సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తోంది. ఆమె బంధువు దినేష్ రావల్ అహ్మదాబాద్‌లో 'యజ్ఞం' నిర్వహించారు.

Sunita Williams safe arrival
Sunita Williams : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో 9 నెలలకు పైగా గడిపిన తర్వాత నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ భూమికి తిరుగుపయనమయ్యారు. ఈ సందర్భంగా, గుజరాత్‌లోని ఆమె కుటుంబం సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థనలు చేస్తోంది. ఆమె బంధువు దినేష్ రావల్ అహ్మదాబాద్‌లో ‘యజ్ఞం’ నిర్వహించారు.
సునీత సురక్షితంగా తిరిగి రావాలని కుటుంబంలోని ప్రతి ఒక్కరూ దేవున్ని ప్రార్థిస్తున్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ఆమె తిరిగి వస్తున్నందని అందరూ సంతోషంగా ఉన్నారు. ఐఎస్ఎస్‌లో 9 నెలలకు పైగా గడిపిన తర్వాత విలియమ్స్, ఇతర వ్యోమగాములతో కలిసి భూమిపైకి తిరిగి వస్తున్నారు.
సునీత రాక కోసం భారత్‌లోని ఆమె పూర్వీకుల గ్రామం ఆశగా ఎదురుచూస్తోంది. ఆమె వచ్చిన వెంటనే పండగ చేసుకునేందుకు రెడీ అవుతోంది. సునీత విలియమ్స్ పూర్వీకులు గుజరాత్‌లో ఝూలాసన్‌లో నివాసముంటున్నారు.
దేశవ్యాప్తంగా, సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరిగి రావాలని ప్రజలందరూ ప్రార్థిస్తున్నారు. ఆమె స్వస్థలమైన ఝులసన్‌లో నాసా వ్యోమగామి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని నివాసితులు ‘హవన్’ నిర్వహించారు. ఝులసన్‌లోని డోలా మాతా ఆలయంలో కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి.
“మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. గత తొమ్మిది నెలలుగా సునీత విలియమ్స్ కోసం ప్రార్థిస్తున్నాము. ఆమె మొదటిసారి అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు ఆమె తనతో కలిసి డోలా మాత ఫొటోను తీసింది. ఆమె భారత్ వచ్చినప్పుడల్లా, ఆమె కచ్చితంగా ఈ ఆలయాన్ని సందర్శిస్తుంది” అని అక్కడి పూజారి దినేష్ పాండ్యా అన్నారు.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న నాసా బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమగాములు సునీత విలియమ్స్, బారీ విల్మోర్ మరో ఇద్దరు కలిసి ఐఎస్ఎస్ నుంచి బయలుదేరి మార్చి 19న తెల్లవారుజామున 3:27 గంటలకు భూమిపై ల్యాండ్ కానున్నారు.