Super Typhoon Hinnamnor:2022లో ప్రపంచంలో అత్యంత తీవ్ర తుపాన్ ఇదేనట.. మహా ప్రళయమే ముంచుకొస్తోందా?

సూపర్ టైఫూన్ హిన్నమ్నోర్ 2022లో అత్యంత బలమైన ప్రపంచ తుఫానుగా పేర్కొంటున్నారు. ఇది జపాన్‌లోని దక్షిణ దీవులను భయపెడుతూ, తూర్పు చైనా సముద్రంవైపు దూసుకెళ్తోంది. యూఎస్ జాయింట్ టైఫూన్ హెచ్చరికల సెంటర్ (US-JTWC) ప్రకారం..

Super Typhoon Hinnamnor: సూపర్ టైఫూన్ హిన్నమ్నోర్ 2022లో అత్యంత బలమైన ప్రపంచ తుఫానుగా పేర్కొంటున్నారు. ఇది జపాన్‌లోని దక్షిణ దీవులను భయపెడుతూ, తూర్పు చైనా సముద్రంవైపు దూసుకెళ్తోంది. యూఎస్ జాయింట్ టైఫూన్ హెచ్చరికల సెంటర్ (US-JTWC) ప్రకారం.. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం మీదుగా 257 కిలో మీటర్ల నుంచి 314 కి.మీ వేగంతో ప్రచండ గాలులు వీస్తూ ఫిలిప్పిన్స్, జపాన్, చైనాలను సూపర్ టైఫూన్ హిన్నమ్నోర్ భయపడెతోంది.

Philippines : భారీ వర్షాలతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం.. విరిగిపడుతున్న కొండచరియలు.. వారంరోజుల్లో 121 మంది మృతి..

ప్రస్తుతం ఈ తుపాన్ ప్రచండ గాలులతో జపాన్‌లోని ఒకినావాకు తూర్పున దాదాపు 230 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ – నైరుతి దిశలో గంటకు 22 కి.మీ వేగంతో ర్యూక్యూ దీవుల వైపు వెళ్తుందని జపాన్ వాతావరణ సంస్థ ధృవీకరించింది. జపాన్ ఎయిర్‌లైన్స్ కో.ఒకినావా ప్రాంతంలోని అన్ని విమానాలను అక్కడి ప్రభుత్వం రద్దు చేసింది. చిన్నచిన్న ద్వీపాలపై ఈ తుఫాన్ ప్రభావం మరింతగా ఉండొచ్చని, దక్షిణం వైపు ఉన్న ప్రాంతాలు, భారత్ తీర ప్రాంతాలపై దీని ప్రభావం తక్కువగా చూపించే అవకాశాలు ఉన్నాయని జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం అక్కడ వీస్తోన్న గాలులను పరిశీలిస్తే ప్రపంచంలో ఈ ఏడాదిలోనే అత్యంత బలమైన తుపానుగా జపాన్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొంటున్నారు. అయితే తీరానికి సమీపించే సమయంలో గాలులు వేగం క్షీణించే అవకాశం ఉందని యూఎస్ జాయింట్ టైఫూన్ హెచ్చరికల సెంటర్ ముందస్తు అంచనా వేసింది.

ఇదిలాఉంటే ఈ ఏడాదిలో వేగం, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుంటే దూసుకొచ్చిన 11 తుఫానుల్లో హిన్నమ్నోర్ అత్యంత శక్తివంతమైన తుఫానుగా వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇదిలాఉంటే తూర్పు చైనా ప్రాంతంలో ప్రతీయేటా బలమైన తుఫాన్లు సంభవిస్తూనే ఉంటాయి. ప్రతి ఏడాది దాదాపు 20 టైపూన్లు జపాన్ ను తాకుతాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వీటి కారణంగా ఈ సీజన్ లో అక్కడ భారీ వర్షాలు, వరదలు సంభవిస్తుంటాయి. గడిచిన ఏడు దశాబ్దాల్లో కేవలం 1961, 1997 సంవత్సరాల్లో ఆగస్టు నెలలో మాత్రమే అక్కడ తుపాన్లు సంభవించలేదని అంర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు