Philippines : భారీ వర్షాలతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం.. విరిగిపడుతున్న కొండచరియలు.. వారంరోజుల్లో 121 మంది మృతి..

తుఫాన్లతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం అవుతుంది.. గతేడాది డిసెంబర్ లో వచ్చిన రాయ్ తుఫాన్ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలకొద్దీ ఊళ్లు జలమయం అయ్యాయి..

Philippines : భారీ వర్షాలతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం.. విరిగిపడుతున్న కొండచరియలు.. వారంరోజుల్లో 121 మంది మృతి..

Philippines

Philippines :  తుఫాన్లతో ఫిలిప్పీన్స్ అతలాకుతలం అవుతుంది.. గతేడాది డిసెంబర్ లో వచ్చిన రాయ్ తుఫాన్ దేశాన్ని అతలాకుతలం చేసింది. వేలకొద్దీ ఊళ్లు జలమయం అయ్యాయి. ఈ తుఫాన్ కారణంగా 146 మంది మృతి చెందారు. వందల సంఖ్యలో వరదల్లో గల్లంతయ్యారు. ఈ విషాదం మరిచిపోక ముందే వారం రోజులుగా ఏకదాటిగా కురుస్తున్న వర్షాలు ఫిలిప్పీన్స్ ను అతలాకుతలం చేస్తున్నాయి. ఉష్ణ మండల తుఫాన్ మెగి కారణంగా మరణించిన వారి సంఖ్య 121కి చేరింది.

Philippines : ఎక్కడ చూసినా మృతదేహాలే..రాయ్ తుపాన్ బీభత్సం

వీరిలో 81 మంది బాధితులు సెంట్రల్ ఫిలిప్పీన్స్ నగరంలో కొండచరియలు విరిగిపడి సమాధి అయ్యారని అక్కడి అధికారులు గురువారం వెల్లడించారు. మరణాల్లో సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో 118, దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ముగ్గురు ఉన్నారు. ఉష్ణమండల తుఫాను మెగి కారణంగా వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదల్లో ప్రజలు నరకయతన అనుభవిస్తున్నాయి. మరోవైపు భారీ కొండచరియలు విరిగిపడుతున్నాయి. అయితే నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ కౌన్సిల్ ఇప్పటివరకు 76మంది మరణించారని, 29 మంది వరదల్లో గల్లంతయ్యారని నివేదించింది. విపత్తుల వల్ల ప్రభావితమైన ప్రావిన్సుల నుండి నివేదికలను సేకరించే ఏజెన్సీ, ప్రాణనష్టం సంఖ్యను ధృవీకరిస్తున్నట్లు తెలిపింది.

Earthquake : ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం..రిక్కర్ స్కేలుపై 7.1 గా నమోదు

తూర్పు విసయాస్ ప్రాంతంలోని జాతీయ పోలీసు ప్రతినిధి బెల్లా రెంటుయా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో గురువారం నాటికి 113 మంది కొండచరియలు విరిగి పడి, వరదల కారణంగా మరణించారని తెలిపారు. బేబే సిటీలో 81 మంది, లేటె ప్రావిన్స్‌లోని అబుయోగ్ పట్టణంలో 31 మంది, సమర్ ప్రావిన్స్‌లో ఒకరు కొండచరియలు విరిగిపడి మరణించారని, మరో ఐదుగురు తప్పిపోయారని, తుఫానులో కనీసం 236 మంది గాయపడ్డారని ఆమె ఒక నివేదికలో తెలిపారు. గత ఆదివారం భూమిని ఫిలిప్పిన్స్ లో ప్రారంభమైన మెగి తుఫాను. ఫిలిప్పీన్స్ ద్వీపసమూహం పసిఫిక్ టైఫూన్ బెల్ట్‌గా ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత విపత్తు పీడిత దేశాలలో ఒకటిగా నిలిచింది.