Earthquake : ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం..రిక్కర్ స్కేలుపై 7.1 గా నమోదు

ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయ తీరంలో గురువారం (ఆగస్టు 12,2021) తెల్లవారుఝామున సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది.

Earthquake : ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం..రిక్కర్ స్కేలుపై 7.1 గా నమోదు

Earthquake

Earthquake in Philippines : ఫిలిప్పీన్స్‌ను భారీ భూకంపం సంభవించింది. ఆగ్నేయ తీరంలో గురువారం (ఆగస్టు 12,2021) తెల్లవారుఝామున సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.1గా నమోదైంది. పొందగిటాన్‌కు తూర్పున 63 కిలోమీటర్ల దూరంలో భూమికి 65.6 కిలోమీటర్ల లోతున భూకంపం సంభవించినట్టు ఇక ఫిలిప్పీన్స్‌ ఇన్సిస్టిట్యూట్‌ ఆప్‌ వోల్కనాలజీ, సిస్మాలజీ భూకంప నష్టాన్ని అంచనా వేస్తున్నాయి.

కాగా భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మొదట్లో అధికారులు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. కానీ అనంతరం పరిస్థితిని సమీక్షించిన అధికారులు అటువంటి ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. దీంతో ప్రజలు కొంతలో కొంత ఊపిరి పీల్చుకున్నారు.

అయితే..ఫిలిప్పీన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వోల్కోనాలజీ అండ్ సిస్మోలజీ (ఫివోల్క్స్) నష్టాన్ని అంచనా వేసే పనిలో పడింది. . దేశానికి సునామీ ముప్పు పొంచి ఉందని ఫివోల్క్స్ పేర్కొనగా..అలాంటిదేమీ లేదని యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ అండ్ హవాయి ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. కాగా..ఫిలిప్పీన్స్ భౌగోళికంగా చురుకైన పసిఫిక్ రింగ్‌లో ఉండటంతొ తరచుగా భూకంపాలను ఎదుర్కొంటుంటుంది.