Philippines : ఎక్కడ చూసినా మృతదేహాలే..రాయ్ తుపాన్ బీభత్సం
య్ తుపాను కారణంగా గంటకు 195-270 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు.

Death Toll From Super Typhoon Rai Soars To 375
Super Typhoon Rai : రాయ్ తుపాను ధాటికి కుదేలైన ఫిలిప్పీన్స్‌లో వెతికినకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. పెనుగాలులతో విరుచుకుపడిన తుపాను కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 375కు చేరుకుంది. ఇంకా 55 మంది జాడ తెలియాల్సిఉంది. మరో 500 మంది గాయాలపాలయ్యారు. తుపాను ధాటికి చెట్లు విరిగిపడి, గోడలు కూలిపోవడంతోనే మృతుల సంఖ్య భారీగా పెరిగిందని వెల్లడించారు అధికారులు. సహాయక చర్యలు చేపడుతున్నట్లు ప్రకటించారు.
Read More : Hyderabad : భార్య కోసం ఇద్దరు భర్తల పోరాటం
తుపాను ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. వేలాది మంది ఇళ్లల్లో నుంచి బయటకు రాలేదని, ఖాళీ చేయలేదని తెలిపారు అధికారులు. ఇళ్లు ధ్వంసమైపోవడంతో అనేక మంది కూడు, గూడుకు దిక్కులేక అవస్థలు పడుతున్నారు. ప్రజలకు సాయమందించాలని స్థానిక అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తుపాను కారణంగా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Read More : Omicron Threat : ఒమిక్రాన్‌పై జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్రం
సమాచార, రవాణా వ్యవస్థలు స్తంభించిపోయాయి. పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాయ్ తుపాను కారణంగా గంటకు 195-270 కిలోమీటర్ల వేగంగా ఈదురు గాలులు వీచినట్లు అధికారులు తెలిపారు. గడిచిన కొద్ది సంవత్సరాలలో ఎదురైన తుపాన్లలో తీవ్రమైనదిగా తెలిపారు. ఇంకా అనేక ప్రాంతాల్లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి.