Nara Lokesh: నాకన్నీ గుర్తున్నాయి.. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో తెలుసు- లోకేశ్ హాట్ కామెంట్స్
ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో 53 రోజులు బంధించి ఏం సాధించావు?
Nara Lokesh: రాజమండ్రిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాట్ కామెంట్స్ చేశారు. తన తల్లిని అవమానించారు, తన తండ్రిని అన్యాయంగా 53 రోజులు జైల్లో పెట్టారని అన్నారు. తనకు అన్నీ గుర్తున్నాయన్న లోకేశ్.. ఎవరికి ఎప్పుడు ముహూర్తం తెలుసుని వార్నింగ్ ఇచ్చారు.
‘తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేస్తామన్నారు. తెలుగుదేశం పార్టీ ఉండొద్దన్నారు. కొంతమంది పార్టీని వీడినప్పుడు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. కానీ, కార్యకర్తలు చూపించారు తెలుగు దేశం పార్టీ అనేది రాబోయే వందేళ్లు ఈ భూమ్మీద ఉంటుందని. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ఉంటుంది. రాష్ట్రంలో ఒక సైకో ఉన్నాడు. ఎంత మంచి సినిమా అయినా ఒక చిన్న విలన్ ఉంటాడు. నువ్వు మా నాయకుడిని అరెస్ట్ చేసి ఇదే రాజమండ్రి జైల్లో 53 రోజులు బంధించి ఏం సాధించావు? నువ్వు అరెస్ట్ చేస్తే మేము భయపడాలా? ఎర్ర బుక్కులో ఇంకా చాలా పేజీలు ఉన్నాయి. ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు తెలుసురా భయ్’ అని కార్యకర్తల సమావేశంలో నారా లోకేశ్ అన్నారు.
Also Read: ఏపీలో “రౌడీషీటర్ల బహిష్కరణ” పొలిటికల్ ఇష్యూ కాబోతోందా?
