Farmers: రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు..

ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది రైతులకు లబ్ధి కలగనుంది.

Farmers: రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు..

Updated On : December 19, 2025 / 11:18 PM IST

Farmers: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సన్న రకం వరి సాగు చేసిన రైతులకు బోనస్ ఇవ్వనుంది. క్వింటాకు రూ.500 చొప్పున అదనంగా బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బోనస్ నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం రూ.649 కోట్లు కేటాయించింది. ప్రభుత్వం నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది రైతులకు లబ్ధి కలగనుంది. ఈ నెల 22 నుంచి చెల్లింపులు మొదలవుతాయని అధికారులు తెలిపారు. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు జమ కానుంది.

Also Read: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వారందరికి రేషన్ బంద్‌ అవుతుందా..? క్లారిటీ ఇచ్చిన అధికారులు..