Sydney man Burglar : ఇంట్లో దొంగను చంపేసి.. శవంపై స్ప్రే చల్లుతూ 15ఏళ్లు ఇంట్లోనే..

ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగను కాల్చి చంపేశాడు.. అతడి మృతదేహాన్ని 15ఏళ్లు ఇంట్లోనే పెట్టుకున్నాడు. వాసన రాకుండా ఉండేందుకు ప్రతిరోజూ ఎయిర్ ప్రెషనర్లను జల్లుతూ వస్తున్నాడు.

Sydney man Burglar : ఇంట్లో దొంగను చంపేసి.. శవంపై స్ప్రే చల్లుతూ 15ఏళ్లు ఇంట్లోనే..

Sydney Man Killed Burglar, Kept Body For 15 Years

Updated On : May 20, 2021 / 2:03 PM IST

Sydney man Burglar : ఇంట్లో దొంగతనానికి వచ్చిన దొంగను కాల్చి చంపేశాడు.. అతడి మృతదేహాన్ని 15ఏళ్లు ఇంట్లోనే పెట్టుకున్నాడు. వాసన రాకుండా ఉండేందుకు ప్రతిరోజూ ఎయిర్ ప్రెషనర్లను జల్లుతూ వస్తున్నాడు. ఆస్ట్రేలియాలో జరిగిన ఈ దారుణం ఎట్టకేలకు బయటపడింది. మృతదేహం వాసన రాకుండా ఉండేందుకు దాదాపు 70కిపైగా ఎయిర్ ఫ్రెషనర్లను వాడేశాడు. 2002 సిడ్నీకి చెందిన బ్రూసెన్‌ రాబర్ట్స్‌ అనే వ్యక్తి ఇంట్లో షేన్‌ స్నెల్‌మెన్‌ దొంగ చోరీ చేశాడు.

అది గుర్తించిన రాబర్ట్స్‌ అతడిని కాల్చి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని ఇంట్లోనే దాచిపెట్టాడు. ఏమి ఎరగనట్టుగా ఉంటున్నాడు. 2017లో రాబర్ట్స్‌ మృతి చెందాడు. ఇంట్లో నుంచి భరించలేనంత దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాబర్ట్స్‌ మృతదేహాన్ని దహనం చేశారు.

సరిగ్గా ఏడాది తరువాత ఎస్టేట్‌ను క్లీన్ చేస్తుండగా దొంగ క్షీణించిన మృతదేహం బయటపడింది. అంతేకాదు.. ఆ మృతదేహం పక్కనే 70 బాటిళ్లకుపైగా ఎయిర్‌ ప్రెషనర్స్‌ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఇంట్లో తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. రాబర్ట్స్ ఇంట్లో నుంచి చాలా తక్కువగా బయటకు వచ్చేవాడని స్థానికులు పోలీసులకు తెలిపారు.