తాగితే పోతావురా అని పెద్దలు ఊరికే అనలేదు అని.. ఈ వార్త వింటే గుర్తుకొస్తోంది. తాగు.. అయితే తాగి డ్రైవింగ్ చేయొద్దు అని ప్రభుత్వాలు గట్టిగా చెబుతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి మరీ జైలుకి పంపుతున్నాయి మన ప్రభుత్వాలు. అయినా మారటం లేదంట. అందుకే తాగి డ్రైవింగ్ చేసే వాళ్లను పట్టుకుని చంపేయాలని డిసైడ్ అయ్యింది ప్రభుత్వం. ఇంత పెద్ద వార్త.. ఇంత చిన్నగా చెబుతారు ఏంటీ అని అనుకుంటున్నారా.. మన భారతదేశంలో కాదు.. తైవాన్ దేశంలో ఈ కొత్త రూల్ తీసుకొస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన చట్టాలను మార్చి.. తైవాన్ పార్లమెంట్ లో ఆమోదం కోసం వెయిట్ చేస్తుంది.
Read Also : లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ
తైవాన్ దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా రోడ్డు ప్రమాదాలు, మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం మరణ శిక్షకు అనుకూలంగా చట్టాన్ని సవరించబోతున్నది. ప్రస్తుతం ఆ దేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా ప్రమాదం జరిగితే.. ఆ ప్రమాదం చేసిన వ్యక్తికి 10ఏళ్ల శిక్ష వేస్తున్నారు. ఇది 12ఏళ్ల వరకు పొడిగించిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఇంకా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తగ్గుముఖం.. రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో న్యాయ మంత్రిత్వ శాఖ ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతుంది.
మద్యం మత్తులో వాహనాలు నడిపి పోతున్న ప్రాణాలు ఎన్నో. మన దేశంలో అయితే మద్యం తాగి వాహనం నడిపి దొరికితే ఒక చలానా కట్టి, జైలుకి వెళితే సరిపోతుంది. తైవాన్‌లో మాత్రం అలా కుదరదు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కఠిన శిక్షలు అమలు చేయడమే కాక.. ప్రమాదానికి కారణమై.. ఆ ప్రమాదంలో ఎవరైనా చనిపోతే అందుకు కారణమైన వ్యక్తికి మరణ శిక్ష విధించేందుకు చేయనున్నారు. ఈ బిల్లును పార్లమెంట్‌లో పెట్టి ఆమోదింపజేయించాలని ప్రభుత్వం చూస్తుంది.
Read Also : కిరాతకం : పట్టపగలు.. నడిరోడ్డుపై వెంటపడి నరికేశాడు