మిలటరీ బేస్ పై తాలిబన్ ఎటాక్…20మంది జవాన్లు మృతి

Taliban attacks military base in Afghanistan ఆఫ్ఘనిస్థాన్ లో ఫరాహ్ సిటీలోని మిలటరీ బేస్ పై తాలిబన్లు దాడి చేశారు. శుక్రవారం సైనిక స్థావరంపై తాలిబన్లు చేసిన దాడిలో 20మంది ఆఫ్గాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు జవాన్లను తాలిబన్ మిలిటెంట్లు కిడ్నాప్ చేశారు.
శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో షఖ్-ఇ-బాలా కాన్స్క్ ప్రాంతంలోని సైనిక శిబిరంపై తాలిబన్లు దాడి చేసినట్లు ఫరా ప్రావిన్షియల్ కౌన్సిల్ మండలి అధికారి దదుల్లా ఖని తెలిపారు. సోర్ షమల్ ప్రాంతంలో ఘర్షణను అదుపు చేసేందుకు భద్రతా దళం ప్రయత్నిస్తుండగా సైనిక స్థావరంపై తాలిబన్లు దాడి చేసినట్లు వెల్లడించారు. భారీగా ఆయుధాలను కూడా దోచుకెళ్లినట్లు తెలిపారు.
మరోవైపు, సైనికుల ఎదురుకాల్పుల్లో 12మంది తాలిబన్లు కూడా మరణించినట్లు దదుల్లా ఖని తెలిపారు. కాగా, సైనిక శిబిరంపై తామే దాడి చేసినట్లు తాలిబన్ ప్రకటన విడుదల చేసింది.