Taliban bans forced marriage: బలవంతపు పెళ్లిళ్లు నిషేధిస్తూ తాలిబన్ల తాజా నిర్ణయం..!

బలవంతపు పెళ్లిళ్లు నిషేధిస్తు తాలిబన్ల తాజా నిర్ణయం తీసుకున్నారు తాలిబన్లు,దీంతో తాలిబన్లు మారిపోయారా? అని ప్రపంచం అంతా ఆశ్చర్యపోతోంది. తాలిబన్ల మార్పు వెనుక ఉన్న అసలు కారణం అదేనా?

Taliban bans forced marriage of women in Afghan : తాలిబన్లు మారిపోయారా? ముఖ్యంగా మహిళల విషయంలో..తాలిబన్లకు మంచి బుద్ధి వచ్చిందా? మహిళలకు ఇష్టం లేకపోయినా బలవంతంగా వివాహాలు చేసుకునే విషయంలోను తాలిబన్లు మారిపోయారా? మహిళలకు ఓ మనసు ఉంటుందని..వారికి ఇష్టాఅయిష్టాలు ఉంటాయని..వారి నిర్ణయాలకు విలువ ఇవ్వాలనే మంచి ఆలోచన తాలిబన్లకు వచ్చిందా? అంటే నిజమేననిపిస్తోంది ఆఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ల ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో..! తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోతోంది.

ఆడది అంటే మగవాడికి బానిసే..లైంగిక వాంఛలు తీర్చే ఓ యంత్రం అన్నట్లుగా చూసే తాలిబన్ల వైఖరిలో మార్పు వచ్చినట్టే కనిపిస్తోంది. మహిళల్ని ఆటబొమ్మలుగా పరిగణించే తాలిబన్లు తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘‘మహిళ అనుమతి లేకుండా పెళ్లిళ్లు చేయడం నేరమంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు తాలిబన్లు. బలవంతపు పెళ్లిళ్లను నిషేధిస్తున్నామని శుక్రవారం (డిసంబర్ 3,2021) డిక్రీ జారీచేశారు.

Read more : Taliban : ఉగ్రవాదులను పెళ్లి చేసుకోవాలని..ఆఫ్ఘాన్ మహిళలపై ఒత్తిడి

ఆడవారిని ఆస్తిగా పరిగణించకూడదని స్పష్టం చేశారు తాలిబన్లు. స్త్రీపురుషులిద్దరూ సమానమేనని..వారికి ఇష్టం లేకుండా పెళ్లి చేసినా..చేసుకున్నా నేరమేనని చీఫ్ హిబతుల్లా అఖుంజాదా ప్రకటించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ తాలిబన్ అధిపతి హిబతుల్లా అఖుంద్‌జా పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. బలవంతుపు పెళ్లిళ్లు చేసినా..చేసుకున్నా కఠినంగా శిక్షిస్తామని..పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని సదరు యవతి చెబితే చేసుకోవాలని ఒత్తిడి చేసినా తప్పేనని ప్రకటించారు.

Readmore : Taliban Govt : మీడియాకు తాలిబన్ల హుకూం..మహిళలు కనిపించే షోలు ప్రసారం చేయద్దు..జర్నలిస్టులు బురఖా ధరించాల్సిందే

పేదరికం కారణంగా ఆఫ్ఘనిస్థాన్‌లో బలవంతపు పెళ్లిళ్లు సర్వసాధారణంగా మారాయి. అప్పుకింద అమ్మాయిలను చెల్లించడం, విక్రయించడం అక్కడ అనాదిగా వస్తోంది. అంతేకాదు..గిరిజన తెగల్లోని మహిళలు భర్త చనిపోతే అతడి అన్నదమ్ముల్లో ఒకరిని చేసుకోవాలన్న నియమం కూడా ఉంది. అది ఆచారమంటూ బాధిత మహిళలను వారి ఇష్టానుసారంగా వాడుకోవటం సర్వసాధారణంగా మారిపోయింది. తాజాగా..తాలిబన్లు జారీ చేసిన ఆదేశాలతో వీటన్నింటికీ ఇక కాలం చెల్లినట్లైంది. తాలిబన్లు తీసుకున్న నిర్ణయం ప్రకారం..భర్తను కోల్పోయిన మహిళ 17 వారాల తర్వాత తన ఇష్ట ప్రకారం నచ్చిన వ్యక్తిని పెళ్లాడే స్వేచ్ఛ ఇస్తున్నట్టు కూడా తాలిబన్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం. మహిళల విషయంలో తాలిబన్లు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోతోంది. మహిళలు బయటకు రాకూడదు..ఉద్యోగాలు చేయకూడదు..వారు ఇంటికే పరిమితం కావాలని ఆంక్షలు విధించిన తాలిబన్లు తాజాగా ఇంత సంచలన నిర్ణయం తీసుకోవటం వినటానికి చాలా చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది.

Read more : Afghan Crisis :తమను జైళ్లకు పంపిన మహిళా జడ్జిల కోసం గాలిస్తున్న తాలిబన్లు..ప్రాణభయంతో దాక్కున్న వందలమంది న్యాయమూర్తులు

నిజానికి ఆప్ఘనిస్థాన్ తిరిగి తాలిబన్ల వశమయ్యాక ఎక్కువగా భయపడింది..ప్రాణాలతో ఉంటామా? లేదా? అనే భయాందోళనకు గురైంది ఆ దేశంలోని మహిళలే. వారి భయానికి తగినట్లే తాలిబన్ల అరాచకాలు కూడా జరిగాయి. అణచివేత, వేధింపులకు కూడా గురయ్యారు. దీంతో చాలామంది దేశం విడిచి పారిపోయారు కూడా.కానీ అందరిని ఆశ్చర్యపరిచేలా తాలిబన్లు మహిళల బలవంతపు వివాహాలపై కఠిన వైఖరి అవలంబించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వారిలో ఈ ఉదారవాద వైఖరిని ఊహించని ప్రపంచం వారి నిర్ణయంపై ప్రశంసలు కురిపిస్తోంది. అయితే, తాలిబన్ల నిర్ణయం వెనక అంతర్జాతీయ ఒత్తిడి ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

Read more: Afghan Crisis : వాలీబాల్ క్రీడాకారిణి తల నరికేసిన తాలిబన్లు

ట్రెండింగ్ వార్తలు