Taliban Govt : మీడియాకు తాలిబన్ల హుకూం..మహిళలు కనిపించే షోలు ప్రసారం చేయద్దు..జర్నలిస్టులు బురఖా ధరించాల్సిందే

అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్లు ప్రభుత్వం మీడియాకు హెచ్చరికలు జారీ చేసింది. మహిళలు కనిపించే షోలు ప్రసారం చేయద్దుని..జర్నలిస్టులు బురఖా ధరించాల్సిందేననీ హుకుం జారీ చేసింది.

Taliban Govt : మీడియాకు తాలిబన్ల హుకూం..మహిళలు కనిపించే షోలు ప్రసారం చేయద్దు..జర్నలిస్టులు బురఖా ధరించాల్సిందే

Taliban Govt Ban Tv Shows Featuring Women Actors

Taliban Govt ban TV shows featuring women actors : అఫ్ఘానిస్థాన్ ను హస్తగతం చేసుకుని పాలనాపగ్గాలు చేపట్టిన తాలిబన్లు తమ మార్పు పాలనే చేస్తున్నారు. ముఖ్యంగా మహిళల్ని అణచివేసే ఏ ఆంక్షలు వదలటంలేదు.మహిళలు కనిపించకూడదు. వారి స్వరం వినిపించకూడదనే తాలిబన్ల మోనార్క్ పాలనలో భాగంగా మరో హుకుం జారీ చేశారు.మహిళా నటులు కనిపించే ఏ షోలు ప్రసారం చేయరాదు అని మీడియాకు హెచ్చరికలు జారీ చేశారు.ఇప్పటికే మహిళలపై ఎన్నో ఆంక్షలు విధించిన తాలిబన్ నేతలు తాజాగా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలపై నిబంధనలు కొనసాగిస్తున్న క్రమంలో టీవీ షోలపైనా కూడా ఆంక్షలు విధించింది. మహిళా నటులు ఉండే షోలు, కార్యక్రమాలు తక్షణమే నిలిపివేయాలని తాలిబన్ల ప్రభుత్వం మీడియాను ఆదేశించింది. దీనికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది తాలిబన్ల ప్రభుత్వం.

Read more : Taliban Drugs : డ్రగ్స్ బానిసలకు అన్నం పెట్టడం లేదు, గుండ్లు గీయిస్తున్నారు..తాలిబన్ల అరాచకం

అఫ్ఘానిస్థాన్ మంత్రిత్వ శాఖ నుంచి స్థానిక మీడియాకు వచ్చిన తొలి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. మహిళా నటులు ఉండే కార్యక్రమాలతోపాటు మహమ్మద్ ప్రవక్త, ఇతర మత ప్రముఖులను చూపించే సినిమాలుగానీ..టీవీ ప్రోగ్రాంలుగానీ ప్రసారం చేయకూడదని హెచ్చరించింది. ఏ ఛానల్ లో కూడా ఇటువంటి ప్రసారాలు చేయవద్దని అఫ్ఘాన్ ప్రమోషన్ ఫర్ వర్చ్యూ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ వైస్ మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిధిలోకి మహిళా జర్నలిస్టులు కూడా వస్తారని హెచ్చరించింది. కానీ మహిళా జర్నలిస్టులు విషయంలో కాస్త సడలించి తప్పనిసరిగా ముసుగు ధరించాలని వార్నింగ్ ఇచ్చింది. మహిళా జర్నలిస్టులు రిపోర్టింగ్ చేసే సమయంలో తప్పనిసరిగా హిజాబ్ ధరించాలని స్పష్టం చేసింది.

Read more : Afghan Crisis :తమను జైళ్లకు పంపిన మహిళా జడ్జిల కోసం గాలిస్తున్న తాలిబన్లు..ప్రాణభయంతో దాక్కున్న వందలమంది న్యాయమూర్తులు

గతంలో తాలిబన్ల పాలన పోయాక అఫ్గాన్ లో చాలా మార్పులు వచ్చాయి. ప్రజలు స్వేచ్ఛాగాలి పీల్చుకున్నారు.ముఖ్యంగా మహిళలు స్వతంత్రంగా జీవించటం నేర్చుకున్నారు. అలా 2001లో ఆఫ్గాన్ లో ప్రజాస్వామ్య పాలన తర్వాత అఫ్గాన్ మీడియాలో చాలా మార్పులు వచ్చాయి. పాశ్చాత్య దేశాల మద్దతుతో కొనసాగిన పాలనలో పలు టీవీ ఛానళ్లు, రేడియో స్టేషన్లు అవతరించాయి. మహిళలు ఉద్యోగాల్లో చేరారు.వారి ప్రతిభలను చాటుకున్నారు. గత 20 ఏళ్లలో ఈ ఛానల్ లు అన్నీ ఎలాంటి అవాంతరాలు లేకుండా అనేక కార్యక్రమాలను స్వేచ్ఛగా ప్రసారం చేశాయి. అమెరికన్ ఐడల్ లాంటి రియాల్టీ షో లతోపాటు పలు విదేశీ షోలు, భారతీయ సినిమా, సీరియళ్లను ప్రసారం చేశాయి.

Read more : Afghanistan : స్టే హోమ్..మహిళా ఉద్యోగులకు తాలిబన్ ఆదేశం

కానీ మరోసారి మహిళలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి మరోసారి అధికారంలోకి వచ్చిన తాలిబన్ల పాలనలో.మరోసారి తాలిబన్ల ప్రభుత్వం అధికారంలోకి రాగానే…మహిళలపై కొరఢా ఝళిపిస్తోంది. మీడియాలో మహిళలు కనిపించే ప్రసారాలు రావద్దని కొరడా ఝుళిపిస్తోంది. దీంతో రెండు దశాబ్దాల కింద ఉన్న తాలిబన్ల అరాచక పాలన మళ్లీ మొదలైందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. గతంలో తాలిబన్లు పాలనలో టీవీలు, సినిమాలు, వంటి ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాములను అనైతికం అంటూ తాలిబన్లు విరుచుకుపడుతున్నారు. గతంలో టీవీలు చూస్తూ కనిపించిన వారికి బహిరంగంగానే శిక్షలు వేశారు. ఇప్పుడు తాజాగా మీడియాపై హెచ్చరికలు జారీ చేస్తు..తమ నిబంధనల్ని కాదంటే ఫలితాలు తీవ్రంగా ఉంటాయని..గతంతో తాము చేసిందే మళ్లీ చేస్తామని హెచ్చరిస్తోంది తాలిబన్ల ప్రభుత్వం.

Read more : Taliban : ఉగ్రవాదులను పెళ్లి చేసుకోవాలని..ఆఫ్ఘాన్ మహిళలపై ఒత్తిడి