Taliban Hideouts Destroyed : తాలిబన్ల స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్..250మంది మృతి..వీడియో

తాలిబన్ల స్థావరాలపై ఆఫ్గాన్ సైన్యం మెరుపుదాడి చేసింది.

Taliban Hideouts Destroyed : తాలిబన్ల స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్..250మంది మృతి..వీడియో

Afgan

Updated On : August 1, 2021 / 5:21 PM IST

Taliban Hideouts Destroyed తాలిబన్ల స్థావరాలపై ఆఫ్గాన్ సైన్యం మెరుపుదాడి చేసింది. కాందహార్ ఫ్రావిన్స్ లోని జెరాయ్ జిల్లాలో. తాలిబన్లు తలదాచుకునేందుకు ఉపయోగిస్తున్న స్థావరాలపై ఎయిర్ స్ట్రైక్స్ చేపట్టినట్లు ఆదివారం ఆఫ్గానిస్తాన్ ప్రభుత్వం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ దాడిలో పదుల సంఖ్యలో తాలిబన్ తీవ్రవాదులు మరణించారని,పెద్ద సంఖ్యలో గాయపడ్డారని తెలిపింది.

ఇక,గడిచిన 24 గంటల్లో..గజ్నీ,కాందహార్,తాఖర్,కుందుజ్,బగ్లాన్,కాబుల్,కాపినా రాష్ట్రాల్లో ఆఫ్గాన్ నేషనల్ సెక్యూరిటీ ఫోర్సెస్(ANSF)చేపట్టిన ఆపరేషన్స్ లో.. 250 మంది వరకు తాలిబన్లు మరణించినట్లు,దాదాపు 100 మంది గాయపడినట్లు ఆఫ్గాన్ రక్షణశాఖ తెలిపింది. అదేవిధంగా, దాదాపు 13 ఐఈడీ బాంబులను కనుగొని వాటిని నిర్వీర్యం చేసినట్లు తెలిపింది.