ముగ్గురు భారతీయ ఇంజినీర్లను వదిలిపెట్టిన తాలిబన్లు

ఆఫ్లాన్ జైళ్లలో ఉన్న అగ్రశ్రేణి తాలిబన్ నాయకులు రిలీజ్ అయ్యారని తాలిబన్ అధికారులు తెలిపారు. గత నెలలో అమెరికా-తాలిబాన్ చర్చలు ఆగిపోయిన తర్వాత…వారం రోజుల క్రితం అమెరికా రాయబారి పాకిస్తాన్ రాజధానిలో అగ్రశ్రేణి తాలిబాన్ నాయకులను కలిసిన కొద్ది రోజులకే మాజీ షాడో గవర్నర్లతో సహా తమ బృందంలోని చాలా మంది సభ్యులను ఆఫ్ఘన్ జైళ్ల నుండి రిలీజ్ అయ్యారని తాలిబాన్ అధికారులు తెలిపారు.
విడుదలైన తాలిబాన్ వ్యక్తులలో ఈశాన్య కునార్ ప్రావిన్స్ షాడో గవర్నర్ షేక్ అబ్దుల్ రహీమ్, నైరుతి నిమ్రోజ్ ప్రావిన్స్ షాడో గవర్నర్ మౌల్వి రషీద్ ఉన్నారు. తమ నియంత్రణలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో తాలిబాన్లు షాడో ప్రభుత్వాన్ని స్థాపించారు.ఇస్లామిక్ చట్టం లేదా షరియా చట్టాల రూల్స్ ప్రకారం నేరస్థులను విచారించడానికి కోర్టులను కూడా ఏర్పాటు చేశారు.
తాలిబాన్ రాజధాని కాబూల్ కి ఉత్తరాన ఉన్న బగ్రామ్ సైనిక స్థావరం దగ్గరున్న ఆఫ్గనిస్తాన్ లోని అతిపెద్ద జైళ్ళ నుండి తాలిబన్లను విడుదల చేయబడినట్లు సమాచారం. యు.ఎస్ దళాలు కొన్నేళ్ల క్రితం ఈ స్థావరాన్ని ఆఫ్ఘన్ భద్రతా దళాలకు అప్పగించినప్పటికీ.. బగ్రామ్ లో ఇంకా సైనిక ఉనికి ఉంది. అయితే తాలిబాన్లను విడుదల చేసింది అమెరికానా లేక ఆఫ్గన్ దళాలా అన్నది తెలియాల్సి ఉంది. ఆఫ్గనిస్తాన్ రక్షణశాఖ కానీ అధ్యక్షుడి కార్యాలయం కానీ దీనిపై కామెంట్ చేసేందుకు నిరాకరించింది.
తమ దగ్గర బందీలుగా ఉన్న ముగ్గురు భారతీయ ఇంజనీర్లను విడుదల చేసినట్లు తాలిబన్ అధికారులు తెలిపారు. దీనిని భారత ప్రభుత్వం ఇంకా ధృవీకరించలేదు. అయితే ముగ్గురు భారతీయ ఇంజనీర్లకు బదులుగా 11 తాలిబాన్లను విడుదల చేసినట్లు ఆఫ్ఘన్ ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. తాలిబాన్ లేదా యుఎస్ శాంతి ప్రతినిధి జల్మయ్ ఖలీల్జాద్ పాకిస్తాన్ పర్యటనతో దీనికి సంబంధం లేదని ఆయన అన్నారు.