Afghanistan
Taliban Still Killing : అప్ఘాన్ లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే కఠిన ఆంక్షలు నడుమ ప్రజలు బతుకులీడుస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్నా..తాలిబన్లు ఏ మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఇటీవలే అప్ఘాన్ ను వశం చేసుకున్న తాలిబన్లు..మంచి పాలన అందిస్తామని చెప్పినా..అది నిజం కాదని తేలిపోయింది. పగ, ప్రతికారాలతో రెచ్చిపోతున్నారు. ప్రధానంగా మహిళలపై ఉక్కుపాదం మోపుతున్నారు. వారి వస్త్రధారణపై కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే…గత ప్రభుత్వ హాయాంలో పోలీసు, నిఘా విభాగాల్లో పని చేసిన అధికారులను కిడ్నాప్ చేస్తున్నారు.
Read More : Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ నుంచి చాలా మందిని కాపాడుకోవచ్చు
దొరకని వారిని వేటాడి..వెంటాడి మరి హత్యలకు పాల్పడుతున్నారు. ఈ విషయాన్ని హ్యుమన్ రైట్స్ వాచ్ నివేదికలో వెల్లడించడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది. నాలుగు ప్రావిన్స్ లో సుమారు 100 మందికి పైగా కనిపించడం లేదని..వీరిని హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత…గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఉద్యోగులను క్షమించామని తాలిబన్లు ప్రకటించారు. మాజీ ఉద్యోగులను భయకంపితులు చేసేలా తాలిబన్లు దారుణాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
Read More : Sirivennela : పాటలే కాదు పుస్తకాలు కూడా రచించిన సిరివెన్నెల
ఆగస్టు 15వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు నాలుగు ప్రావిన్స్ లలో 47 మంది మాజీ సైనికులు, మరో 53 మంది ఇతరులు హత్యకు, అపహరణకు గురైనట్లు హక్కులు సంస్థ వెల్లడిస్తోంది. ఇదిలా ఉంటే..అధికారంలోకి రాగానే..ఎలాగైనా ప్రతికార చర్యలకు తాలిబన్లు పాల్పడుతారని మాజీ అధికారులు భావించారు. ప్రాణభద్రతకు హామీ పత్రాలు పొందారు. అయితే..వారి రికార్డుల్లో పేర్లు, చిరునామాల ఆధారంగా వారిని వెంటాడుతున్నారని నివేదికలో వెల్లడించింది. అప్ఘానిస్తాన్ లో తాలిబన్ల ప్రతికార హత్యలతో ప్రజలు భయకంపితులవుతున్నారు.