Omicron Variant: ఒమిక్రాన్ వేరియంట్ నుంచి చాలా మందిని కాపాడుకోవచ్చు
కొవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ నుంచి చాలా పెద్ద సంఖ్యలో భారతీయుల్ని రక్షించుకోవచ్చని, భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్............

omicron
Omicron Variant: కొవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ నుంచి చాలా పెద్ద సంఖ్యలో భారతీయుల్ని రక్షించుకోవచ్చని, భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్. ఇండియన్ SARS-COV-2 జెనోమిక్స్ కన్సార్టియా (INASACOG) అడ్వైజరీ గ్రూప్ మాజీ హెడ్ అయిన జమీల్, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, మాస్క్‌లు ధరించాలని అన్నారు.
‘జాగ్రత్తగా ఉండాలి, భయపడాల్సిన అవసరం లేదు. డెల్టా వేరియంట్ కారణంగా ఇండియాలో సెకండ్ వేవ్ ఎక్కువ ప్రభావమే చూపించింది. ఊహించిన దాని కంటే ఎక్కువ మందికి వ్యాపించింది. నాలుగో నేషనల్ సర్వేలో ఇండియన్స్ కు 67 శాతం మందికి యాంటీబాడీస్ ఉన్నాయని తెలిసింది. వ్యాక్సినేషన్ అనేది తక్కువగా జరిగితే.. ఇన్ఫెక్షన్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది’ అని మీడియా ముందు వెల్లడించాడు.
‘ఇటీవల ఢిల్లీ వాసులకు 97 శాతం యాంటీబాడీలు, ముంబై వాసులకు 85-90 శాతం ఉన్నట్లు గుర్తించారు. దీనిని బట్టి ఇండియన్లు ఒమిక్రాన్ లేదా మరేదైనా వేరియంట్ నుంచి కలిగే తీవ్రమైన వ్యాధి నుంచి సేఫ్ అవ్వొచ్చు” అని జమీల్ అన్నారు.
………………………………….: ఉత్తరాంధ్రకు తుపాన్ ముప్పు..భారీ నుంచి అతి భారీ వర్షాలు
కోవిడ్-19 కొత్త వేరియంట్ లో అధిక మొత్తంలో స్పైక్ మ్యూటేషన్‌లను కలిగి ఉంది. దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్ మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని భయపడుతున్నారు. నవంబర్ 26న, WHO B.1.1.529ని ఆందోళనను గమనించి.. Omicron అని పేరు పెట్టింది.
కొత్త వేరియంట్‌పై వ్యాక్సిన్‌లు ఏ మాత్రం పనిచేస్తాయా అని అడిగిన ప్రశ్నపై.. మరింత డేటా రావాల్సి ఉంది. వ్యాక్సిన్‌లు నిరుపయోగంగా మారవని తెలిపారు.
‘మాకు డేటా ఇంకా అందుబాటులో లేదు. మొదటి లాబొరేటరీ ఫలితాలు అందుబాటులోకి రావడానికి మరో ఒకటి నుండి రెండు వారాలు పట్టవచ్చు. ఈ వేరియంట్‌పై వ్యాక్సిన్ ప్రభావం అంతగా చూపించకపోవచ్చు. టీకాలు పనికిరాకుండా పోయేవి కావు అని నా అనుకుంటున్నా. తీవ్రమైన వ్యాధుల నుండి కాపాడేందుకు సాయం చేస్తాయి’ అని వివరించాడు.
……………………………………………..: S. E. X అక్షరాలతో ఇష్యూ అయిన నంబర్ ప్లేట్
కొత్త వేరియంట్‌ను ఎదుర్కోవడానికి భారతదేశం ఎలా సిద్ధం అవుతుందని.. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం టీకా రేటును పెంచేటప్పుడు మాస్క్ ధరించడం కొనసాగిస్తూ ఉండాలని అన్నారు.