Taliban : మహిళలు పీజీ, పీహెచ్‌డీ చదవొచ్చు.. బుర్ఖాలు మస్ట్.. కానీ!

అఫ్ఘానిస్తాన్ విద్యాశాఖ మంత్రి అబ్దుల్‌ బాఖీ హక్కానీ చదువుకునే మహిళలంతా కచ్చితంగా ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ పాటించాలని ఆదేశాలు జారీచేశారు. బుర్ఖాలు కచ్చితంగా ధరించాలని స్పష్టంచేశారు.

Taliban To Allow Women To Study In Universities : మహిళల పట్ల తమ వైఖరేంటో మరోసారి స్పష్టం చేశారు తాలిబన్లు. అఫ్ఘాన్ మహిళలు కేవలం పిల్లల్ని కంటే చాలన్నారు తాలిబన్ల అధికార ప్రతినిధి సయ్యద్‌ జెక్రుల్లా హాషిమి. వారికి పదవులేవీ అవసరం లేదన్నారు. అటు చదువుకునే మహిళలు బుర్ఖాలు ధరించాలని విద్యాశాఖ మంత్రి అబ్దుల్ హక్కానీ ప్రకటించారు. అఫ్ఘానిస్తాన్‌లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు.. మహిళలను పిల్లలను కనే మిషన్‌ మాదిరిగానే భావిస్తున్నారు. అఫ్గాన్‌ మహిళలు కేవలం పిల్లల్ని కంటే చాలని, వారికి మంత్రి పదవులు అనవసరమని తాలిబన్ల అధికార ప్రతినిధి సయ్యద్‌ జెక్రుల్లా హాషిమి అన్నారు.

తాలిబన్‌ సర్కారులో తమకు స్థానం కల్పించాలని కోరుతూ అక్కడి మహిళలు రోజురోజుకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్పందించిన జెక్రుల్లా మహిళలు పాలనా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దన్నారు. ఇలాంటి బాధ్యత వారికి అప్పగిస్తే.. తలపై మోయలేనంత బరువు మోపినట్లే అవుతుందన్నారు. మహిళా నిరసనకారులు దేశంలోని మహిళలందరికీ ప్రాతినిధ్యం వహించలేరన్నారు. గతంలో మహిళలకు చోటిచ్చారని. 20 ఏళ్లుగా ఆఫీసుల్లో జరిగింది వ్యభిచారమేనంటూ తాలిబన్ల అధికార ప్రతినిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Taliban : నరికిన తలతో సంబరాలు.. తాలిబన్ల మరో ఆటవిక చర్య

బుర్ఖాలు కచ్చితంగా ధరించాలి :
అఫ్ఘానిస్తాన్ విద్యాశాఖ మంత్రి అబ్దుల్‌ బాఖీ హక్కానీ చదువుకునే మహిళలంతా కచ్చితంగా ప్రత్యేక డ్రెస్‌ కోడ్‌ పాటించాలని ఆదేశాలు జారీచేశారు. బుర్ఖాలు కచ్చితంగా ధరించాలని స్పష్టంచేశారు. మహిళలు తలతో పాటు ముఖం కూడా కనిపించకుండా స్కార్ఫ్‌లు ధరించాలా.. లేక తలకు మాత్రమే సరిపోతుందా అన్న విషయంపై స్పష్టతనివ్వలేదు. అలాగే యూనివర్సిటీ బోధనాశాంల్లోనూ మార్పులు తీసుకొస్తామని అబ్దుల్‌ బాఖీ హక్కానీ ప్రకటించారు. మహిళలు యూనివర్సిటీలు, పీజీ స్థాయిలో చదువుకోవచ్చనని విద్యాశాఖ మంత్రి తెలిపారు.

పురుషులతో విద్య కుదరదు :
పురుషులతో కలిసి విద్యనభ్యసించడం మాత్రం కుదరదని స్పష్టం చేశారు. మహిళలు, పురుషులకు ప్రత్యేక తరగతి గదులు ఉండాలని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేశామన్నారు. అటు అఫ్ఘానిస్తాన్‌లో మహిళలపై ఆంక్షలు రోజురోజుకు పెరగడం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. తాలిబన్లు మహిళలను మనుషుల్లాగా కూడా చూడటం లేదంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Gujarat CM : ఇలా ఎమ్మెల్యేగా గెలిచి అలా సీఎం పదవి పట్టేసి..రేపే భూపేంద్ర ప‌టేల్ ప్ర‌మాణ‌స్వీకారం

ట్రెండింగ్ వార్తలు