Talibans Laughed:మహిళలకు రాజకీయ అవకాశాలా?అంటూ పగలబడి నవ్విన తాలిబన్లు!

మహిళల రాజకీయ ప్రవేశం గురించి ఓ మహిళా రిపోర్టర్ తాలిబన్లను ప్రశ్నించగా ఆడవారికి రాజకీయాలా? అంటూ పగలబడి నవ్విన వీడియో వైరల్ గా మారింది.

Talibans Laughed:మహిళలకు రాజకీయ అవకాశాలా?అంటూ పగలబడి నవ్విన తాలిబన్లు!

Talibans Laughed At Woman Reporter Questioned Them On Women In Politics

Updated On : August 20, 2021 / 10:51 AM IST

Talibans laughed at woman reporter questioned  :  తాలిబన్లు. పురుషాధిక్య భావజాలానికి..అత్యంత క్రూరత్వానికి..జీర్ణించుకుపోయిన ఛాందస భావాలకు…మూర్ఖత్వాలకు ప్రతీకలని వారి అవలంభించే విధానాలను బట్టి అర్థం చేసుకోవచ్చు.అటువంటి వారిని మహిళలను గౌరవంగా చూస్తారా? వారికుండే హక్కులను అమలు జరిగేలా చూస్తారా? అని ప్రశ్నిస్తే దెయ్యాలముందు వేదాలు వల్లించినట్లే ఉంటుంది. అదే జరిగింది అఫ్గానిస్థాన్ లో తాలిబన్లను ఓ మహిళా రిపోర్ట్ వేసిన ప్రశ్నలు. తాలిబన్ నేతలను ఇంటర్వ్యూ చేసిన మహిళా రిపోర్టర్ వేసిన ప్రశ్నలు దానికి తాలిబన్లు హేళనగా నవ్విన నవ్వులు మహిళల పట్ల వారి అభిప్రాయాలేంటో అర్థం అవుతోంది. మహిళల రాజకీయ ప్రవేశంపై ఓ మహిళా రిపోర్ట్ వేసిన ప్రశ్నకు తాలిబన్లు పకపకా నవ్వుతూ ఇటువంటి ప్రశ్నలు వింటే “మాకు నవ్వొస్తోంది” అంటూ మీడియా కెమెరాను కూడా నిలిపివేయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది.

తాలిబన్ల దృష్టిలో మహిళల స్థానం ఎంత చులకనగా..చిన్నచూపుగా ఉంటుందో వారి విధానాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. అఫ్గాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబన్లు ఇప్పటికే మహిళల పట్ల వ్యవహరించే తీరు అత్యంత దారుణంగా ఉందనే విషయం అర్థం అవుతోంది. ఈ క్రమంలో ఓ మహిళా రిపోర్టర్ కొందరు తాలిబన్ నేతలను ఇంటర్వ్యూ చేసింది. ఆఫ్ఘన్ ప్రస్తుత పరిస్థితులపై వారిని కొన్ని ప్రశ్నలు వేయగా వాటికి తాలిబన్లు సజావుగానే సమాధానం చెప్పారు. ఆ తరువాత సదరు రిపోర్టర్ మహిళల హక్కుల గురించి ప్రశ్నిస్తే షరియా చట్టం ప్రకారం వర్తింపజేస్తామని ఇది మా నిర్ణయమని స్పష్టంచేశారు.

ఈ క్రమంలో..‘మహిళా రాజకీయనేతలు ఎన్నికల్లో పోటీ చేస్తే మీరు వారికి ఓటు వేస్తారా? వారి  గెలిచి ప్రజాస్వామ్య పదవులు చేపట్టడం మీకు సమ్మతమేనా? అని ఆ రిపోర్టర్ ప్రశ్నించడంతో..దానికి తాలిబన్ నేతలు పగలబడి నవ్వారు. “మాకు నవ్వొస్తోంది” అంటూ మీడియా కెమెరాను కూడా నిలిపివేయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూస్తే మహిళల పట్ల వారి అభిప్రాయాలేంటో..వారి పట్ల తాలిబన్ల విధి విధానాలేంటో పూర్తిగా అర్థం అయిపోతుంది.

కాగా అఫ్గాన్ ను స్వాధీనం చేసుకున్న అనంతరం తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ..”మహిళలు ఇస్లాం చట్టాల ప్రకారమే వారికి హక్కులు ఉంటాయని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.