Viral Video : తల్లి పెళ్లిలో సవతి తండ్రికి స్వాగతం చెబుతూ టీనేజర్ స్పీచ్ వైరల్

సవతి తల్లి, లేదా సవతి తండ్రిని పిల్లలు త్వరగా అంగీకరించలేరు. కానీ ఓ టీనేజర్ తన తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంటుంటే స్టెప్ ఫాదర్‌ని తమ జీవితంలోకి ఆహ్వానించిన తీరు అందరినీ కట్టిపడేసింది.

viral video

Viral Video : అనుకోని కారణాలతో భార్యాభర్తలు విడిపోతుంటారు. ఇక వారి కారణంగా పిల్లలు పేరెంట్స్‌లో ఒకరికి దూరం అవుతారు. తల్లిదండ్రులు వేరే పెళ్లి చేసుకుంటే వారి జీవితంలోకి వచ్చే పార్టనర్స్ పట్ల పిల్లలు విముఖత చూపిస్తారు. సవతి తల్లి లేదా సవతి తండ్రి వారూ కలవరు.. వారితో పిల్లలు కూడా కలవలేరు. కానీ ఓ టీనేజర్ తన తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంటే తన స్టెప్ ఫాదర్‌ని తమ జీవితంలోకి ఆహ్వానిస్తూ ఎంత చక్కగా మాట్లాడాడో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

Rishi Sunak : హిందువుగా ఉన్నందుకు గర్విస్తున్నా.. రిషి సునక్ వ్యాఖ్యలు వైరల్

goodnews_movement అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేరైన వీడియో వైరల్ అవుతోంది. తల్లి మరో పెళ్లి చేసుకుంటుంటే జోర్డాన్ అనే టీనేజర్ తన స్టెప్ ఫాదర్‌కి స్వాగతం పలుకుతూ స్పీచ్ ఇచ్చాడు. అతని స్పీచ్‌ని అతిథులు శ్రద్ధగా విన్నారు. సవతి తండ్రి విన్నీ తన తల్లిని పెళ్లి చేసుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని.. విన్నీ చాలా ఉత్తమమైన వ్యక్తి అని అతనికి ధన్యవాదాలు అంటూ జోర్డాన్ తన స్పీచ్‌లో చెప్పాడు. తన స్పీచ్‌కి కొంత కామెడీని కూడా యాడ్ చేసి నవ్వులు పూయించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ తో దూసుకుపోతోంది.

Delhi Metro: ఏంటి బ్రో ఇది..! ఢిల్లీ మెట్రోలో మహిళలు డిష్యూం డిష్యూం.. వీడియో వైరల్

చాలామంది పిల్లలు తమ పేరెంట్స్ రెండో పెళ్లి చేసుకుంటే మానసికంగా అంగీకరించలేరు. అలాంటిది జోర్డాన్ తన స్టెప్ ఫాదర్‌ని తమ జీవితంలోకి సంతోషంగా ఆహ్వానించిన తీరు అందరిని ఆకట్టుకుంది. జోర్డాన్‌ని నెటిజన్లు అభినందిస్తున్నారు.