Rishi Sunak : హిందువుగా ఉన్నందుకు గర్విస్తున్నా.. రిషి సునక్ వ్యాఖ్యలు వైరల్

UK ప్రధానమంత్రి రిషి సునక్ ఆయన భార్య అక్షతా మూర్తి ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ దర్శనం అనంతరం రిషి సునక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Rishi Sunak : హిందువుగా ఉన్నందుకు గర్విస్తున్నా.. రిషి సునక్ వ్యాఖ్యలు వైరల్

Rishi Sunak

Rishi Sunak : జీ20 సదస్సులో పాల్గొనేందుకు భారత్ కు వచ్చిన UK ప్రధానమంత్రి రిషి సునక్ ఆయన భార్య అక్షతా మూర్తి ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంలో రిషి సునక్ తన భారతీయ మూలాలు.. దేశంతో ఉన్న అనుబంధం గురించి వ్యాఖ్యలు చేసారు.

Rishi Sunak: భారత్‌కు అల్లుడిని: ఢిల్లీలో రిషి సునక్ ఆసక్తికర కామెంట్స్

రిషి సునక్ ఆయన భార్య అక్షతా మూర్తి న్యూఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. భారీ వర్షం కురుస్తున్నప్పటికి ఉదయం 6.30 గంటలకు ఆలయానికి చేరుకున్నారు. ఆలయ పూజారులు వారికి ప్రాంగణం మొత్తం దగ్గరుండి చూపించారు. ఆలయ దర్శనం అనంతరం ఆయన ఫోటోలతోపాటు ఆయన చేసిన వ్యాఖ్యలను భారతదేశంలోని బ్రిటిష్ హైకమిషన్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. ‘నా భారతీయ మూలాలు, భారతదేశంతో నా సంబంధాల విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. గర్వించదగిన హిందువుగా ఉండటం అంటే.. నాకు భారతదేశంతో పాటు భారతదేశ ప్రజలతో ఎప్పుడూ అనుబంధం ఉంటుంది’ అని రిషి సునక్ వ్యాఖ్యానించారు.

Akshata Murty : రిషి సునక్ భార్య అక్షతామూర్తి వేసుకున్న డ్రెస్ ఖరీదెంతో తెలుసా?

రిషి సునక్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన 43 సంవత్సరాల నాయకుడు. 2015 లో మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. గత ఏడాది అక్టోబర్‌లో మొదటి భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ ప్రధానమంత్రిగా రిషి సునక్ హిస్టరీ క్రియేట్ చేసారు. ఆయన భార్య అక్షతా మూర్తి ఇండియాలోని బిలియనీర్, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, విద్యావేత్త సుధామూర్తి దంపతుల కుమార్తె.