Akshata Murty : రిషి సునక్ భార్య అక్షతామూర్తి వేసుకున్న డ్రెస్ ఖరీదెంతో తెలుసా?

G20 సమ్మిట్ కోసం న్యూఢిల్లీకి వచ్చిన UK ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి ఇండియన్ లేబుల్‌తో రూపొందించిన దుస్తులు ధరించారు. డ్రాన్ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్న ఈ దుస్తుల ఖరీదెంతో తెలుసా?

Akshata Murty : రిషి సునక్ భార్య అక్షతామూర్తి వేసుకున్న డ్రెస్ ఖరీదెంతో తెలుసా?

Akshata Murty

Akshata Murty : UK ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య, ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తి ఇండియన్ లేబుల్‌తో ధరించిన దుస్తులతో తళుక్కున మెరిసారు.  బ్రిటిష్ కౌన్సిల్ విద్యార్దులతో జరిగిన సమావేశంలో ఆమె ధరించిన దుస్తులు అందర్నీ ఆకర్షించాయి.

Rishi Sunak : కేంబ్రిడ్జ్‌లో రామ్ కథకు హాజరైన బ్రిటీష్ ప్రధాని రిషి సునక్

G20 సమ్మిట్ కోసం న్యూఢిల్లీకి వచ్చిన UK ప్రధాన మంత్రి రిషి సునక్ భార్య అక్షతా మూర్తి ఇండియన్ లేబుల్‌తో రూపొందించిన దుస్తులు ధరించారు. అక్షతా బ్రిటిష్ కౌన్సిల్ విద్యార్ధులు, సిబ్బందితో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. వస్త్రధారణ విషయానికి వస్తే ఫ్యాషన్ ప్రియురాలు అయిన ఆమె ఇండియన్, వెస్ట్రన్ సంప్రదాయాలను మిళితం చేసేలా కనిపించిన స్కర్ట్, మరియు షర్ట్‌లో కనిపించారు. ఆరెంజ్, పింక్, పసుపు రంగులు కలబోసిన ప్రింటెడ్ షర్ట్.. మిడ్ లెంగ్త్ షర్ట్ ధరించారు.

Rishi Sunak: భారత్‌కు అల్లుడిని: ఢిల్లీలో రిషి సునక్ ఆసక్తికర కామెంట్స్

అక్షతా ధరించిన దుస్తులు డ్రాన్ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ‘వైల్డ్ ఐరిస్ శాటిన్ ఓవర్ సైజ్డ్ షర్ట్’ పేరుతో ఉన్న బ్రీజీ ఫిట్ శాటిన్ షర్ట్ కాస్ట్ రూ.6,990 కాగా.. స్కర్ట్ ధర రూ.7,499 గా తెలుస్తోంది.