Delhi Metro: ఏంటి బ్రో ఇది..! ఢిల్లీ మెట్రోలో మహిళలు డిష్యూం డిష్యూం.. వీడియో వైరల్

ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళల మధ్య ఘర్షణకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Delhi Metro: ఏంటి బ్రో ఇది..! ఢిల్లీ మెట్రోలో మహిళలు డిష్యూం డిష్యూం.. వీడియో వైరల్

Delhi Metro Fighting,

Updated On : September 7, 2023 / 2:32 PM IST

Delhi Metro Fighting: ఢిల్లీ మెట్రో వింత ఘటనలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. ఎక్కువగా ఇక్కడి మెట్రోలో ప్రయాణీకుల మధ్య పోట్లాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. ఢిల్లీ మెట్రో అధికారులు పలుసార్లు హెచ్చరికలు జారీ చేసినా ఫలితం ఉండటం లేదు. తాజాగా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు మహిళలు ఫైటింగ్ చేసుకొనేందుకు సిద్ధమయ్యారు. వారిని ఓ మహిళా పోలీస్ అడ్డుకోవటంతో పెద్ద ఘర్షణకు దారితీయకుండా వివాదం సద్దుమణిగిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Viral Video : బిచ్చగాడి పట్ల ఓ చిన్నారి దయాగుణం.. అతని కోసం ఏం చేసిందంటే?

ఢిల్లీలోని మెట్రో కోచ్‌లో ఇద్దరు మహిళలు వాదులాడుకోవటం వీడియోలో చూడొచ్చు. వీరిలో బ్లాక్ డ్రెస్ వేసుకున్న మహిళ మరీ రెచ్చిపోయి ప్రవర్తించింది. ఇద్దరు మహిళలను వారించేందుకు అక్కడే ఉన్న మహిళా కానిస్టేబుల్ ప్రయత్నించినప్పటికీ ఘర్షణ సర్దుమణగలేదు. బ్లాక్ డ్రెస్ వేసుకున్న మహిళ నేను జడ్జి కుమార్తెను అంటూ పోలీసుపైసైతం రెచ్చిపోయింది. మరో మహిళ నేను ఏం తప్పు చేయలేదు. ఎవరిపైనా శారీరకంగా దాడి చేయలేదని చెప్పింది. చివరకు స్టేషన్ రావడంతో వారిద్దరిని మెట్రో నుంచి దింపేయడంతో గొడవ సర్దుమణిగింది.

 

మెట్రోలో ఇద్దరు మహిళల మధ్య ఘర్షణకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏంటీ బ్రో.. ఈ ఆడవాళ్లు మరీ ఇలా తయారయ్యారు.. వీళ్లకు ఎక్కడ చూసినా గొడవలేనా అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. మహిళా పోలీస్ అధికారికి సెల్యూట్ చేద్దాం అంటూ మరో నెటిజన్ రాశాడు. ఇలా పలువురు నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్ల చేస్తున్నారు.