Viral Video : బిచ్చగాడి పట్ల ఓ చిన్నారి దయాగుణం.. అతని కోసం ఏం చేసిందంటే?
పసి పిల్లల్లో ఎటువంటి కల్లా కపటం ఉండదు. అందుకే వారిని దేవుడితో సమానం అంటారు. ఓ చిన్నారి ఓ బిచ్చగాడిపై చూపించిన దయాగుణం నెటిజన్లను కంట తడి పెట్టించింది. ఇంతకీ ఆ చిన్నారి ఏం చేసింది?

Viral Video
Viral Video : ఓ స్కూల్ విద్యార్ధిని బిచ్చగాడికి తన బాక్స్‌లో ఫుడ్ తినిపించిన వీడియో వైరల్ అవుతోంది. ఆ చిన్నారి దయాగుణానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.
ఇంటర్నెట్‌లో ప్రతి నిత్యం రకరకాల భావోద్వేగాలతో నిండిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. queen_of_valley అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేరైన వీడియో అందరి హృదయాన్ని కదిలించింది. ఓ పాఠశాల విద్యార్ధిని బిచ్చగాడికి మొదట డబ్బులు ఇస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. తరువాత తన బాక్స్ లోంచి శాండ్ విచ్ తీసి అతని చేతికి ఇస్తుంటే అతను సంకోచిస్తున్నట్లు అనిపించాడు. వెంటనే ఆమె తన చేత్తో అతనికి శాండ్ విచ్ తినిపించింది. ఆ తరువాత అతనికి షేక్ హ్యాండ్ ఇస్తుంటే స్వీట్ వీడియో ఎండ్ అవుతుంది. ఈ వీడియో షేర్ చేసిన తరువాత మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించింది. అనేకమంది ఆ చిన్నారి దయాగుణంపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
‘ఆమె తల్లి ఒక యువరాణిని పెంచింది’ .. ‘దేవుడు ఆ చిన్నారి చేతులు పట్టుకుని అతనికి తినిపిస్తున్నట్లు.. అతనికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
View this post on Instagram