Ukraine Students
Russia – Ukraine War: కొద్ది వారాలుగా నెలకొన్న ఉద్రిక్తత వాతావరణం నుంచి భారత విద్యార్థులు ఎట్టకేలకు బయటపడుతున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం యుక్రెయిన్ లో బయల్దేరిన తొలి బృందంలో 23మంది తెలంగాణ విద్యార్థులు ఆదివారం హైదరాబాద్ చేరుకోనున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని తెలంగాణ భవన్ నుంచి బయల్దేరగా సాయంత్రం 5గంటల 15 నిమిషాలకు ఎయిరిండియా విమానంలో చేరుకుంటారు.
ఆదివారం ఉదయం రొమేనియా, హంగేరి దేశాల మీదుగా ఢిల్లీ వచ్చారు.
మరో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు విద్యార్థులు స్వగ్రామాలకు వెళ్లిపోయారు. అక్కడి పరిస్థితి గురించి వారి మాటల్లో..
Read Also : తగ్గేదే లే…అంటున్న యుక్రెయిన్ ప్రజలు
తొలి బ్యాచ్ లో సాయి ప్రవీణ్, కావ్య శ్రీ అనే ఇద్దరు తెలుగు విద్యార్థులు ఉన్నారు.
‘యుక్రెయిన్ లోని మేము ఉండే ప్రాంతంలో యుద్ధం ప్రభావం అంతగా లేదు. వెస్టర్న్ సైడ్ యుక్రెయిన్‌లో యుధ్ధ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. మా యూనివర్సిటీ రుమేనియా బోర్డర్‌కు దగ్గర ఉండటంతో త్వరగా రాగలిగాం. కొన్ని వేల మందికి పైగా భారత విద్యార్ధులు అక్కడే ఉండిపోయారు’
‘అక్కడ పరిస్థితులు రోజు రోజుకి దిగజారుతున్నాయి. యుక్రెయిన్‌లో చిక్కుక్కున్న విద్యార్ధులను వెనక్కి రప్పించే ప్రయత్నాలు వేగంగా జరగాలని కోరుకుంటున్నాం. మమ్మల్ని వెనక్కి తీసుకువచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రయత్నాలు మరువలేం.
‘అర్దాంతరంగా కాలేజీలు, చదువులు వదిలేసి రావల్సి వచ్చింది. విద్యార్థులు భవిష్యత్ గురించి ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటున్నాం’ అని ల్యాండ్ అయిన తర్వాత ప్రవీణ్, కావ్య వెల్లడించారు.