అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ద్వారకానాథ్ సూసైడ్‌కు కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.
అమెరికాలో తెలుగు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు జిల్లా కురబలకోట మండలం మట్టివారిపల్లె గ్రామానికి చెందిన గుమ్మడికాయల ద్వారకానాథ్ రెడ్డి అక్కడ ఓ బ్యాంక్‌లో పని చేస్తున్నారు. ఆయనకు భార్య కళ్యాణితో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు.
కుటుంబ సభ్యులు, బంధవులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయనకు ఆర్థిక ఇబ్బందులు, వివాదాలు లేవని బంధువులు చెబుతున్నారు. ద్వారకానాథ్ ఆత్మహత్యతో ఆయన స్వగ్రామంలో విషాదం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ద్వారకానాథ్ సూసైడ్‌కు కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.