China : చైనాలో జిమ్ పైకప్పు కూలి 10 మంది మృతి

ఈశాన్య చైనాలో పాఠశాల వ్యాయామశాల పైకప్పు కూలిపోవడంతో పది మంది మరణించారు. ఈ దుర్ఘటనలో మరొకరు శిథిలాల కింద చిక్కుకుపోయారని చైనా అధికారులు సోమవారం చెప్పారు. హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని క్వికిహార్‌లోని 34వ నంబర్ మిడిల్ స్కూల్‌లోని జిమ్ కుప్పకూలింది.....

China gym collapsed : ఈశాన్య చైనాలో పాఠశాల వ్యాయామశాల పైకప్పు కూలిపోవడంతో పది మంది మరణించారు. ఈ దుర్ఘటనలో మరొకరు శిథిలాల కింద చిక్కుకుపోయారని చైనా అధికారులు సోమవారం చెప్పారు. హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని క్వికిహార్‌లోని 34వ నంబర్ మిడిల్ స్కూల్‌లోని జిమ్ కుప్పకూలింది. సోమవారం ఉదయం 5:30 గంటల నాటికి శిథిలాల్లో నుంచి 14 మందిని బయటకు తీశారు. (Gym Roof Collapses In China) నలుగురి మృతదేహాలను వెలికితీశారు. క్షతగాత్రులకు చికిత్స చేస్తుండగా ఆరుగురు మరణించారు.

Plane Crash : పోర్ట్ సుడాన్ విమానాశ్రయంలో కూలిన విమానం…9మంది మృతి

పైకప్పు జిమ్‌పై కూలిపోవడంతో రెస్క్యూ వర్కర్లు శిథిలాలను తొలగించారు. 160 మంది అగ్నిమాపక సిబ్బంది, 39 టక్కులతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. ఈ ఘటనపై చైనా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. భారీవర్షాల వల్ల జిమ్ పైకప్పు కూలిందని అధికారులు చెప్పారు.

Indian woman : భారతీయ మహిళ ఫేస్‌బుక్ స్నేహితుడిని కలవడానికి పాక్ వెళ్లింది…

జిమ్ నిర్మాణ సంస్థ యజమానిని చైనా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైనాలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల పారిశ్రామిక ప్రమాదాలు జరుగుతున్నాయి. 2015లో టియాంజిన్‌లో రసాయన గిడ్డంగిలో జరిగిన భారీ పేలుడులో 165 మంది మరణించారు.

ట్రెండింగ్ వార్తలు