Viral Video: వీధి కుక్కలకు క్రిస్మస్ ట్రీట్ ఇచ్చిన థాయిలాండ్ వ్యక్తి .. ఫిదా అవుతున్న నెటిజన్లు.. వీడియో వైరల్
థాయిలాండ్ లోని నియాల్ హర్బిసన్ అనే వ్యక్తి క్రిస్మస్ సందర్భంగా వీధికుక్కలకు విందు ఏర్పాటు చేసి గొప్ప మనస్సు చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది.

Street dogs
Viral Video: క్రిస్మస్ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పండుగను పురస్కరించుకొని చాలా మంది సంతోషంగా తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడుపుతారు. కొందరు తమ తోటివారిని పలు ప్రాంతాలకు తీసుకెళ్లి ట్రీట్ ఇస్తారు. అయితే, థాయిలాండ్ కు చెందిన వ్యక్తి.. మనుషులకేనా పార్టీలు.. కుక్కలకు ఉండవా అని ఆలోచించాడో ఏమో.. ఆయన నివసించే ప్రాంతంలోని వీధి కుక్కలకు మంచి ఫుడ్‌ను అందించాడు.
Viral Video: క్రిస్మస్ స్పెషల్… -30 డిగ్రీల చలిలో భాంగ్రా నృత్యం చేసిన గుర్దీప్ పంధర్
థాయిలాండ్ లోని నియాల్ హర్బిసన్ అనే వ్యక్తి క్రిస్మస్ సందర్భంగా వీధికుక్కలకు విందు ఏర్పాటు చేసి గొప్ప మనస్సు చాటుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. హర్బిసన్ వీడియో క్యాప్షన్ కూడా ఇచ్చాడు. నేను ఈ రోజు వీధి కుక్కల గుంపుకు మంచి భోజనాన్ని అందించాను. ఇందుకోసం ఉదయం 4.30 గంటలకు లేచాను. స్వయంగా ఆహారాన్ని తయారు చేసి అందించాను అని తెలిపాడు.
View this post on Instagram
వీడియోలో వివరాల ప్రకారం.. తాను స్వయంగా తయారు చేసిన ఆహారాన్ని ప్లేట్స్‌లో పెట్టి తన జీపుపై వాటిని వీధి కుక్కలు ఉండే ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ తనకు తారసపడిన వీధికుక్కకు ఆహారాన్ని అందించాడు. హర్బిసన్ మంచి మనస్సుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సెలవు రోజుల్లో నేను చూసిన అత్యంత అందమైన విషయాల్లో ఇది ఒకటి అంటూ పలువురు పేర్కొనగా.. వచ్చే క్రిస్మస్ కు మేముకూడా ఇలా చేస్తాం అంటూ మరికొందరు తెలిపారు.