Russian President Putin: పుతిన్ ఆరోగ్యంపై ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చర్చ.. ఆయన చేతులు నిజంగానే రంగు మారాయా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యంపై ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతుంది. ఆయన చేతులు రంగుమారాయంటూ సోషల్ మీడియా వేదికగా చర్చజరుగుతుంది.

Russian President Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనారోగ్యంతో బాధపడుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ప్రపంచ వ్యాప్తంగా మరోసారి చర్చనీయంశంగా మారింది. గత కొన్నినెలల క్రితం పుతిన్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. పుతిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడని, వైద్యం చేయించుకునేందుకు కొన్ని వారాల పాటు అజ్ఙాతంలోకి వెళ్లారని అమెరికా ఇంటెలిజెన్సీ వర్గాలు పేర్కొన్నాయి. వ్యాధి తీవ్రత అడ్వాన్స్ స్థాయికి చేరినట్లు వెల్లడించారు. కొద్దిరోజుల తరువాత పుతిన్ రష్యాలోని అధికారిక కార్యక్రమాల్లో ప్రత్యక్షమవ్వడంతో ఆ వార్తలకు బ్రేక్ పడింది.

Putin Nuclear Bomb : మరోసారి పుతిన్ నోట అణుబాంబు మాట..! వణికిపోతున్న పాశ్చాత్య దేశాలు

మరోసారి పుతిన్ ఆరోగ్యంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆయన చేతులు రంగుమారాయంటూ సోషల్ మీడియా వేదికగా చర్చజరుగుతుంది. గత మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, క్యూబా అధ్యక్షుడు మిగుయేల్ డియాజ్ కానెల్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. పశ్చిమ దేశాలకు తమ ఉమ్మడి శత్రువు అమెరికా ఇస్తోన్న అనమతులపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశంలో ఇరు దేశాల అధ్యక్షులు కరచాలనం చేస్తున్న సమయంలో, వారి మధ్య చర్చ జరుగుతున్న సమయంలో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో పుతిన్ చేతులు రంగు మారడమే మరోసారి పుతిన్ ఆరోగ్యంపై చర్చకు కారణమైంది. పుతిన్ చేతులు పర్పుల్ రంగులో కనిపించడంతో ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడని ప్రచారం జరుగుతుంది.

Putin: భారత్‭పై ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

పుతిన్ చేతులపై ఉన్న మచ్చలను నిశితంగా పరిశీలిస్తే ఇంజక్షన్ సూదులు గుచ్చడం వల్ల మచ్చలు ఏర్పడినట్లు ఉందని బ్రిటన్ ఆర్మీ మాజీ అధికారి, హౌస్ సభ్యుడు లార్డ్స్ రిచర్డ్ దనత్ అన్నారు. సూదులు గుచ్చి ఔషదాలు అందివ్వడం వల్లనే చేతులు రంగు మారాయని అనుకోవచ్చని ఆయన తెలిపాడు. 70ఏళ్ల పుతిన్ అరోగ్యంపై మరోసారి ప్రపంచ వ్యాప్తంగా చర్చజరుగుతున్న నేపథ్యంలో రష్యా ఏవిధంగా స్పందిస్తుందనే అంశం ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు