Putin: భారత్‭పై ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

గత వారం జరిగిన ఓ కార్యక్రమంలో సైతం భారత్‭పై పుతిన్ ప్రశంసలు కురిపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలను, భారత దేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. భవిష్యత్తు భారత దేశానిదేనని కూడా అన్నారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా భారత్ పాత్ర పెరుగుతుందని కూడా పుతిన్ అన్నారు.

Putin: భారత్‭పై ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు పుతిన్

Russian President Putin lauds India again

Putin: భారతీయులపై మరోసారి ప్రశంసలు కురిపించారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. గతవారమే మన దేశంపై పొగడ్తలు కురిపించిన ఆయన.. తాజాగా మరోసారి ప్రశంసలతో ముంచెత్తారు. నవంబరు 4న రష్యన్ యూనిటీ డే సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ భారతీయులు ప్రతిభావంతులని, అభివృద్ధిలో అద్భుత ఫలితాలను సాధించేందుకు అవసరమైన గొప్ప సమర్థత, విజయకాంక్ష కలవారని అన్నారు.

‘‘భారత దేశాన్ని కనుక చూసుకుంటే.. తమ అభివృద్ధి కోసం, తమ లక్ష్యాలను సాధించగల గొప్ప ప్రతిభావంతులు మనకు అక్కడ కనిపిస్తారు. ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. కచ్చితంగా భారత్‭లో అద్భుత ఫలితాలు వస్తాయి. ఆ దేశంలో 150 కోట్లకు పైగా జనాభా ఉన్నారు. నిజానికి ఇప్పుడు వారి అసలైన బలం అదే’’ అని పుతిన్ అన్నారు. గత వారం జరిగిన ఓ కార్యక్రమంలో సైతం భారత్‭పై పుతిన్ ప్రశంసలు కురిపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలను, భారత దేశ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించారు. భవిష్యత్తు భారత దేశానిదేనని కూడా అన్నారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయంగా భారత్ పాత్ర పెరుగుతుందని కూడా పుతిన్ అన్నారు.

Sukesh: ₹500 కోట్లు ఇవ్వమని ఒత్తిడి తెచ్చారు.. కేజ్రీవాల్‭పై సుకేశ్ సంచలన ఆరోపణలు