Cassandra Mae Spittmann : జర్మనీ సింగర్ నోట రామ్ ఆయేంగే పాట.. మోదీ ప్రశంసలు పొందిన ఆ సింగర్‌కి..

జర్మన్ సింగర్ 'రామ్ ఆయేంగే' అని పాట పాడుతుంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గతవారం ప్రధాని నరేంద్ర మోదీ షేర్ చేసిన ఈ పాట విని అందరూ ఆ సింగర్‌ని మెచ్చుకుంటున్నారు.

Cassandra Mae Spittmann

Cassandra Mae Spittmann : జర్మన్ సింగర్ కస్సాండ్రా మే స్పిట్‌మాన్ పాడిన ‘రామ్ ఆయేంగే’ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ స్పిట్‌మాన్ పాడిన పాటను మెచ్చుకుంటూ ప్రధాని మోదీ గత వారం ఆ వీడియోను షేర్ చేసారు.

Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిర నిర్మాణానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చయ్యాయో తెలుసా? పూర్తి వివరాలు..

ప్రపంచం మొత్తం జనవరి 22 కోసం ఎదురుచూస్తోంది. అయోధ్యలో జరగబోయే రామ మందిర ప్రారంభోత్సవానికి సమయం దగ్గరపడుతున్న సందర్భంలో జర్మనీకి చెందిన కస్సాండ్రా మే స్పిట్‌మాన్ ‘రామ్ ఆయేంగే’ అంటూ పాడిన పాట అందరి ప్రశంసలు పొందుతోంది. గతేడాది సెప్టెంబర్ 24 న ఆల్ ఇండియా రేడియోలో ప్రసారమైన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భారతీయ సంగీతం, సంస్కృతి పట్ల జర్మన్ గాయని స్పిట్‌మాన్‌కి ఉన్న మక్కువను ప్రధాని మోదీ అభినందించారు.  స్పిట్‌మాన్ అభిరుచి స్ఫూర్తిదాయకమని మోదీ పేర్కొన్నారు. భారత్‌ను ఎన్నడూ సందర్శించకపోయినా.. పుట్టినప్పటి నుండి దృష్టి లోపం ఉన్నా ఆమెకు సంగీతం పట్ల ఉన్న మక్కువ ఆ లోపాన్ని జయించిందని మోదీ చెప్పారు.

Ram Mandir Inauguration : అయోధ్యలో భారీగా పెరిగిన హోటల్ రూం ధరలు.. అక్కడ ఒక్కో రూం ధర 85వేలుపైమాటే

అయితే జనవరి 12న స్పిట్‌మాన్ ‘రామ్ ఆయేంగే’ అంటూ పాడిన పాటను ప్రధాని మోదీ షేర్ చేసారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక విదేశీయురాలు భారతీయ సంగీతం పట్ల కనపరుస్తున్న అభిరుచిని అందరూ మెచ్చుకుంటున్నారు. కసాండ్రా సంస్కృతం, హిందీ, మళయాళం, తమిళం, కన్నడ, అస్సామీ, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ భాషలలో కూడా పాటలు పాడటం విశేషం. తమిళ పాటలు ముఖ్యంగా భక్తిగీతాలు అద్భుతంగా పాడతారు.