Comedy Wildlife Pics (3)
Comedy Wildlife Photography 2021 : జంతువులు కామెడీ చేస్తే ఎట్టుంటందో తెలుసా..ఇదిగో ఇట్టుంటది. ఎంత ముచ్చటగా ఉంటుందో. భలే తమాషాగా అనిపించటమేకాదు..ఎంత ఒత్తిడిలో ఉన్నా జంతువుల్ని చూస్తే చాలా భలే హుషారు వచ్చేస్తుంది.అటువంటిది అవి కామెడీ చేస్తే ఇంక వేరే చెప్పాలా? ఎంత ముద్దుగా..ముచ్చటగా అనిపిస్తుంది. మరి క్యూట్ గా ఉండే బుజ్జి బుజ్జి జంతువులు చేసే వింత వింత చేష్టలు చూస్తే వాటి పట్టుకుని ముద్దు చేయాలనిపిస్తుంది.వార్నీ..ఏం చేస్తున్నాయిరా..భలే భలే అంటూ చప్పట్లు కొట్టేయాలనిపిస్తుంది. కన్నార్పకుండా చూడాలనిపిస్తుంది. అటువంటి కొన్ని ఫోటోలు మీకోసం…
ఈ ఫోటోల్లో ఎంత చెప్పినా అల్లరి చేసే పిల్లను తల్లి ఎలా మందలిస్తుందో..అసలే ముద్దుగా ఉండే ఉడుత సన్నాయి ఊదితో ఎలా ఉంటుందో..ఛెంగు చెంగున దూకుతు వెళ్లే కంగారులు డ్యాన్సులు వేస్తే ఎలా ఉంటుందో..రంగులు మార్చే ఊసరవెల్లి ఠీవీగా కొమ్మపై తమాషాగా కూర్చున్న ఫోటో..కళ్లు గిరగిరా తిప్పుతు మెడను అటు ఇటు క్యూట్ క్యూట్ గా తిప్పే పావురం మొఖం మీద ఓ ఎండిన ఆకు పడి భలే వింతగా ఉన్న ఫోటో ఇలా ఒకటేమిటి మీనాల వింత వింత ఫోజు ఇలా చెప్పుకోవటమెందుకు మీరే చూసేయండీ ..చెప్పిన మాట వినని బిడ్డ చెవిని మెలేస్తున్న తల్లితో పాటు తమషా తమాషా ఫోజుల్ని..
ఫోటోలంటే ఠీవీగా..దర్పంగా..వైల్డ్ గానే కాదు..ప్రకృతిలోని సహజ హాస్యాన్ని పట్టి బంధించాలి. అదిగో అచ్చు అదే చేశారీ ఫొటోగ్రాఫర్స్. ఆ ప్రపంచవ్యాప్త చిత్రాలకు కామెడీ వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ–2021 వేదికయ్యింది. అందులో అవార్డులు అందుకున్న, ఫైనల్‌కు చేరిన కొన్ని ఫొటోలను వెబ్‌సైట్‌లో పెట్టిందా సంస్థ.
చెప్పిన మాట వినకుండా అల్లరి చేసే బుల్లి బిడ్డ చెవిని మెలేస్తున్న తల్లిని ఫోటోకు ‘అండర్ ద సీ’ కేటగిరీలో ఫస్టు ప్రైజ్ గెలుచుకుంది.
చెంగు చెంగున ఎగిరే కంగారులు డ్యాన్స్ చేస్తే ఎంత అందంగా ఉందో చూడండీ..
కోకిలమ్మ పెళ్లికి కోనంతా సందడీ..చిగురాకుల తలంబ్రాలు.. ఉడతమ్మ సన్నాయి’’అనే పాటను తలపించేలా ఓ కర్రపుల్లను నోట్లో పెట్టుకుని వాయిస్తున్నట్టుగా ఉన్న ఈ ఉడత ఫొటో ఫైనల్‌కు చేరింది… ఈ ఫోటోను చూస్తే కళ్లు తిప్పుకోగలరా..
చెట్టుకు ముద్దు ఇస్తున్న కోతి..కొమ్మపై ఠీవీగా కూర్చున్న ఊసరవెల్లి..దోబూచులాడుతున్న భల్లూకం..
ఒక చేప డ్యాన్సులేస్తుంటే..మరో రెండు చేపలు ప్రోత్సహిస్తున్న సూపర్ ఫోటో..ఇటువంటి సీన్ ఎప్పుడైనా చూశారా??నెవ్వర్ కదూ..
తనను ముక్కున కరచుకుని పోవటానికి చూస్తున్న గ్రద్ధను బతిమాలుకుంటున్నట్లుగా ఉన్న ఈ క్యూట్ పిక్ అత్యంత అరుదైనది ప్రత్యేకించి చెప్పలా..
కళ్లు గిరగిరా తిప్పుతు మెడను అటు ఇటు క్యూట్ క్యూట్ గా తిప్పే పావురం మొఖం మీద ఓ ఎండిన ఆకు పడి భలే వింతగా ఉన్న ఈ ఫోటో అందం గురించి ఏమని చెప్పాలి?!
ఇలా ఒకటీ రెండూ కాదు ఎన్నో ఫోటోలు మనల్ని మురిపిస్తాయి. మై మరిపిస్తాయి. మనలోని ఒత్తిడిని హుష్ కాకి అనిపిస్తాయి..