North Korean Army 90th Anniversary : ఉత్తరకొరియా ఆర్మీ 90వ వార్షికోత్సవంవైపే ప్రపంచం దృష్టి..దటీజ్ కిమ్ జోంగ్..

ఉత్తరకొరియావైపు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. కొరియన్ పీపుల్స్ రివల్యూషనరీ ఆర్మీ 90వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. అపార ఆయుధ ప్రదర్శనతో కిమ్ జోంగ్ ఉన్ దేశం సత్తా చాటాలని భావిస్తున్నారు. తమను టచ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో శతృదేశాలకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు.

North Korean Army 90th anniversary : ఉత్తరకొరియావైపు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. కొరియన్ పీపుల్స్ రివల్యూషనరీ ఆర్మీ 90వ వార్షికోత్సవం జరుపుకుంటోంది. అపార ఆయుధ ప్రదర్శనతో కిమ్ జోంగ్ ఉన్ దేశం సత్తా చాటాలని భావిస్తున్నారు. తమను టచ్ చేస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో శతృదేశాలకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు. 2017 తర్వాత మళ్లీ అణ్వాయుధ ప్రయోగాలకు ఉత్తరకొరియా సిద్ధమవుతోందని వార్తలొస్తున్నవేళ ఈ వార్షికోత్సవంపై అందరి దృష్టి నెలకొంది.

Also read : North Korea: పువ్వులు పూయించలేదని తోటమాలీలను జైల్లో పెట్టిన కిమ్

ప్రపంచమంతా కుగ్రామంగా కనిపిస్తున్న గ్లోబలైజేషన్ యుగంలో…మిగిలిన దేశాలతో సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించే అతికొన్నిదేశాల్లో ఉత్తరకొరియా ముందుంటుంది. అసలు ఆ దేశంలో ఏం జరుగుతోందో..రాజకీయాలు ఎలా ఉన్నాయో, పాలన ఎలా సాగుతుందో, ప్రజల జీవనం ఎలా ఉందో ఎవరికీ ఏమీ తెలియదు. అమెరికా, దక్షిణకొరియా ఊహించిరాసే వార్తలతోనే ఉత్తరకొరియాను ప్రపంచం అర్ధం చేసుకుంటూఉంటుంది. ఇవి కాకుండా అతి తక్కువ సందర్భాల్లో మాత్రం ఉత్తరకొరియా అధికారిక మీడియా తమ దేశం వార్తలు మిగిలిన ప్రపంచానికి తెలియజేస్తుంది. సాధారణంగా అణ్వాయుధ పరీక్షలు, బాలిస్టిక్ మిస్సైళ్ల ప్రయోగాలు, అమెరికా, దక్షిణకొరియాకు హెచ్చరికలు వంటివే ఇందులో ప్రధానంగా ఉంటాయి. ఉత్తరకొరియాతో పాటు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గొప్పతనాన్ని వివరించే సందర్భాల గురించి మాత్రమే ఆ దేశ మీడియాలో వార్తలొస్తుంటాయి. అందుకే ఉత్తరకొరియాకు సంబంధించిన ఏ వార్తయినా ప్రపంచానికి ఆసక్తికరంగా ఉంటుంది. ఇప్పుడు ఇదే తరహాలో ఆ దేశ ఆర్మీ 90వ వార్షికోత్సవం వార్తలు అంతటా చర్చనీయాంశంగా మారాయి.

Also read : South Korea : ‘కవ్విస్తే కట్ చేస్తాం’ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌కే వార్నింగ్ ఇచ్చిన దక్షిణకొరియా కొత్త అధ్యక్షుడు

చిన్నదేశమైనప్పటికీ అమెరికా వంటి అగ్రరాజ్యానికి ఉత్తరకొరియా సవాల్ విసిరే స్థితిలో ఉండడానికి కారణం ఆ దేశ ఆయుధ సంపత్తే. అమెరికా మద్దతున్న దక్షిణకొరియాను నియంత్రించేందుకు ఎప్పటికప్పుడు సైనిక శక్తిని, ఆయుధ సంపదను బలోపేతం చేసుకుంటూ ఉంటుంది ఉత్తరకొరియా. దశాబ్దాలుగా ఆ దేశాన్ని పాలిస్తోంది కిమ్ జోంగ్ ఉన్ కుటుంబం. ముఖ్యంగా ప్రస్తుత అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్..ఉత్తరకొరియాను శత్రుదుర్బేధ్యంగా మారుస్తున్నారు. ప్రపంచ దేశాల హెచ్చరికలను పక్కనపెట్టి అణ్వాయుధాలు సమకూర్చుకున్నారు. వరుసగా క్షిపణులు ప్రయోగిస్తూ…కొత్త కొత్త ఆయుధాలను అమ్ములపొదిలో చేర్చుకుంటున్నారు. అంతకంతకూ పటిష్టంగా మారుతున్న కొరియా పీపుల్స్ రివల్యూషనరీ ఆర్మీ దేశ రక్షణలో కీలకపాత్ర పోషిస్తోంది.

Also read : Kim Jong Un: అట్లుంటది మనతోని.. న్యూస్‌ రీడర్‌ను ఆశ్చర్యపర్చిన కిమ్.. ఏకంగా బంగ్లానే రాసిచ్చేశాడు..

ఈ ఆర్మీ 90వ వ్యవస్థాపకదినంలో భారీ మిలటరీ పరేడ్‌లతో పాటు ఆయుధాల బల ప్రదర్శన ఉంటుందని ఉత్తరకొరియా మీడియాలో వార్తలొచ్చాయి. ఉత్తరకొరియా సైన్యం సాధించిన ఘనతలపై ప్రత్యేక కథనాలు రాసింది ప్రభుత్వ వార్తాసంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ. 1953-54లో కొరియా యుద్ధంలో అమెరికాపై పోరాటం, 2010లో దక్షిణకొరియాలోని యోన్‌ప్యోంగ్ ద్వీపంపై దాడి సహా అనేక ఘటనలను ప్రస్తావించింది. ఆధునిక యుద్ధరీతులకు తగ్గట్టుగా రక్షణాత్మక, ఎదురుదాడికి అవసరమైన సామర్థ్యం పొందిందని ప్రశంసించింది. కిమ్ నాయకత్వంపై ప్రశంసలు కురిపించింది. కిమ్ అద్భుతమైన ఆలోచనలు, వ్యూహాలు, ముందుచూపు, దైర్యంతో ఉత్తరకొరియా అజేయమైన శక్తిగా అవతరించిందని కొనియాడింది.

ఉత్తరకొరియా ఈ ఏడాదిలో వరుసగా బాలిస్టిక్ మిస్సైళ్లు పరీక్షించింది. 2017 తర్వాత తొలిసారి అణ్వాయుధ పరీక్షలు కూడా జరుపుతోందని దక్షిణ కొరియా, అమెరికా అనుమతిస్తున్నాయి. ఉత్తర కొరియా ఇటీవల మిలటరీ పరేడ్‌లు ఎక్కువగా రాత్రి వేళల్లో నిర్వహించడం, కొత్త కొత్త ఆయుధాలు ప్రయోగించడం వంటి పరిణామాలపై దక్షిణకొరియా ఆందోళన వ్యక్తంచేస్తోంది. ఈ తరుణంలో ఉత్తరకొరియా మిలటరీ 90వ వార్షికోత్సవం ప్రాధాన్యత సంతరించుకుంది.

ట్రెండింగ్ వార్తలు