Kim Jong Un: అట్లుంటది మనతోని.. న్యూస్‌ రీడర్‌ను ఆశ్చర్యపర్చిన కిమ్.. ఏకంగా బంగ్లానే రాసిచ్చేశాడు..

ఉత్తర కొరియా అధిపతి కిమ్ జోంగ్ ఉన్ పేరు వింటే చాలు ప్రపంచ దేశాలుసైతం ఓ అడుగు వెనక్కు వేస్తాయి. ఆ కిమ్ జోలికి వెళ్లటంకంటే మన పరిదిలో మనం ఉంటే మేలన్న భావనకు వచ్చేస్తారు. నిత్యం ...

Kim Jong Un: అట్లుంటది మనతోని.. న్యూస్‌ రీడర్‌ను ఆశ్చర్యపర్చిన కిమ్.. ఏకంగా బంగ్లానే రాసిచ్చేశాడు..

Kim Jong Un

luxury home ఉత్తర కొరియా అధిపతి కిమ్ జోంగ్ ఉన్ పేరు వింటే చాలు ప్రపంచ దేశాలుసైతం ఓ అడుగు వెనక్కు వేస్తాయి. ఆ కిమ్ జోలికి వెళ్లటంకంటే మన పరిదిలో మనం ఉంటే మేలన్న భావనకు వచ్చేస్తారు. నిత్యం అణుబాంబులు, యుద్ధ విన్యాసాలతో వార్తల్లో నిలుస్తుంటారు కిమ్ జోంగ్ ఉన్. అయితే తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తనను నమ్ముకున్న వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని మెస్సేజ్ ఇచ్చేలా ప్రవర్తించారు. న్యూస్ రీడర్‌ను ఆశ్చర్యపరుస్తూ ఏకంగా బంగ్లానే రాసిచ్చేశాడు.

North Korea Kim Wife :ఊహాగానాలకు చెక్..5 నెలల తరువాత బయటకొచ్చిన కిమ్ భార్య!చప్పట్లతో మారుమ్రోగిన ఆడిటోరియం

దేశ అధికారిక మీడియా కొరియన్ సెంట్రల్ టెలివిజన్ (కేసీటీవీ)లో 79ఏళ్ల రీ చున్ హై దశాబ్దాలుగా న్యూస్ రీడర్‌గా పనిచేస్తుంది. 1970ల ప్రారంభంలో కిమ్ ఇల్ సంగ్ హయాంలో విధుల్లో చేరిన ఆమె.. దేశాధినేత మరణం, అణు, క్షిపణి పరీక్షలు, తదితర ప్రధాన సంఘటనలను తన ఉద్వేగభరిత గొంతుతో ప్రజల వద్దకు చేర్చారు. 50ఏళ్లకుపైగా దేశ ప్రభుత్వ ప్రసారాలకు గొంతుకగా పనిచేస్తున్నారు. క్రమంగా దేశ వార్తా ప్రసారాలకు ముఖచిత్రంగా మారి, తన సంప్రదాయ ఆహార్యంతో పింక్ లేడీగా గుర్తింపు పొందారు.

Kim Yo Jong : దక్షిణ కొరియాపై అణు దాడి చేస్తాం.. కిమ్ సోద‌రి హెచ్చరిక..!

ప్యోంగ్యాంగ్‌లో కొత్తగా నిర్మించిన రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్‌లో తాజాగా ఇంటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కిమ్ రావడంతో పాటు ఆమెతో కలిసి ఇల్లు మొత్తం కలియతిరిగారు. అంతేకాక ఆమె మెట్లు ఎక్కి దిగే సమయంలో చేయిపట్టుకొని దగ్గరుండి నడిపించారు. కిమ్ తీరుతో ఆ దేశ ప్రజలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కిమ్ ఇలాకూడా ఉంటారా అంటూ కొందరు నెటిజర్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహమ్మారి కష్టాలు, దౌత్య ప్రతిష్టంభనలతో దేశం సతమతమవుతోన్న వేళ.. స్థానికంగా ఉన్నత వర్గాల నుంచి మద్దతు కూడగట్టేందుకు కిమ్ ఇలా ప్రయత్నిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.