టర్కీలో హృదయ విదారక దృశ్యం : యజమాని కోసం కుక్క ఆరాటం

  • Published By: madhu ,Published On : October 31, 2020 / 11:30 AM IST
టర్కీలో హృదయ విదారక దృశ్యం : యజమాని కోసం కుక్క ఆరాటం

Updated On : October 31, 2020 / 12:26 PM IST

Crying face izmir and All of Turkey is in Pain : టర్కీలోని ఆ నగరంలో ఎక్కడ చూసిన కూలిన భవంతులు కనిపిస్తున్నాయి. అందులో చిక్కుకున్న వారిని కాపాడేందుకు సిబ్బంది కృషి చేస్తున్నారు. ఎంతో మంది శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు విడిచారు. ఇజ్ మిర్ నగరంలో భూకంపం ధాటికి కూలిన భవంతి వద్ద హృదయ విదారక దృశ్యం కనిపించింది. శిథిలాల కింద చిక్కుకున్న యజమాని కోసం కుక్క తెగ ఆరాటపడుతోంది.



నోరు లేని ఆ జంతువు యజమాని చేయి దగ్గర కూర్చొవడం అందర్నీ కలిచివేస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు Esra Bilgic ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. క్షణాల్లో వైరల్ అయ్యింది. వెరీ శాడ్ అంటూ నెటిజన్లు వెల్లడిస్తున్నారు.



భారీ భూంకంపం ధాటికి టర్కీ విలవిలలాడింది. గ్రీసులోని సామోస్ దీవుల్లోనూ భూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. ప్రధానంగా టర్కీలోని ఇజ్ మిర్ నగరంపై తీవ్ర ప్రభావం చూపెట్టింది. బహుళ అంతస్తులు పేకమేడలా కుప్పకూలిపోయాయి. వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు.



https://10tv.in/greece-turkey-earthquake-people-rescued-from-rubble-after-massive-7-0-magnitude-tremor-destroys-buildings/
ఇప్పటి వరకు 24 మంది దాక చనిపోయారని, 500 మందికిపైగా క్షతగాత్రులున్నట్లు అంచనా. ఈ నగరానికి తీవ్ర నష్టాన్ని కలుగ చేసింది. రిక్టర్ స్కేల్ పై 7గా నమోదైంది. ఏజియన్ సముద్రం వద్ద సుమారు 300 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయని అంటున్నారు.