short-range Covid transmission
Omicron Threat : దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రధానంగా పెద్దనగరాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య తీవ్రంగా కనిపిస్తోంది. తాజా పరిస్థితులు చూస్తుంటే.. దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైనట్టుగా కనిపిస్తోంది. మూడో వేవ్ ప్రభావంతోనే చాలావరకు మెట్రోసిటీల్లో 75శాతం మేర ఒమిక్రాన్ కేసులు నమోదైనట్టు కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధిపతి అభిప్రాయపడ్డారు. మహమ్మారి మూడవ వేవ్ తీవ్రత మొదలైందనడానికి ఒమిక్రాన్ కేసులు పెరగడమే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి పెద్ద నగరాల్లో అత్యధిక స్థాయిలో ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా.. 75 శాతం వాటా మెట్రో సిటీల్లోనే ఉన్నాయని తెలిపారు. గత నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో మొదటిసారి గుర్తించిన ఈ ఒమిక్రాన్.. వ్యాక్సిన్ వేయించుకున్నవారిలోనే అధికంగా వ్యాప్తిచెందడం ఆందోళన కలిగిస్తోంది.
ఒమిక్రాన్ వ్యాప్తిపై కోవిడ్ టాస్క్ ఫోర్స్ స్పందిస్తూ.. ఏదైనా వేరియంట్‌లు జీనోమ్ సీక్వెన్స్ అయ్యాయో లేదో విశ్లేషించాల్సి ఉందన్నారు. డిసెంబర్ మొదటి వారంలో దేశంలో మొదటి ఒమిక్రాన్ కేసు రాగా.. జాతీయంగా గత వారంలో మొత్తం 12 శాతం ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గతంలో కంటే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28 శాతానికి పెరిగింది. దేశంలోని అన్ని కోవిడ్ వేవ్ కేసుల నిష్పత్తిలో ఒమిక్రాన్ అత్యంత వేగంగా పెరుగుతోందని తెలిపారు.
ప్రధాన మెట్రోకు ఇరువైపులా ఉన్న నగరాల్లో ఢిల్లీ, ముంబై, కోల్‌కతాతోపాటు ప్రత్యేకించి ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. ఒమిక్రాన్ బాధితుల్లో దాదాపు 75 శాతానికి పైగా మంది ఐసోలేట్ అయ్యారని ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ లేదా NTAGI చైర్మన్ డాక్టర్ అరోరా అన్నారు. భారత్‌లో ఇప్పటివరకు 1,700 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 510 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కొత్త కోవిడ్-19 కేసులలో 22 శాతం పెరిగినట్టు ప్రభుత్వ డేటా వెల్లడించింది. ఈ సిటీల్లోనే మహమ్మారి మూడవ వేవ్ ముప్పు అధికగా ఉందని డాక్టర్ అరోరా చెప్పారు. ‘ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. భారత్‌లో కరోనా మూడో వేవ్ మొదలై ఉంటుందని అరోరా అంచనా వేశారు. ఈ రోజు నుంచి 15ఏళ్లు నుంచి 18ఏళ్ల వయస్సు ఉన్న పిల్లలకు యాంటీ-కోవిడ్ జబ్స్‌ను అందిస్తున్నట్టు తెలిపారు.
15-18 ఏళ్ల వయస్సు వారికి ఇచ్చే వ్యాక్సిన్ షెల్ఫ్-లైఫ్ డోస్‌లు సురక్షితం కావనే ఆందోళనలను డాక్టర్ అరోరా తోసిపుచ్చారు. ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ డిసెంబర్ 20న కోవాక్సిన్ షెల్ఫ్-లైఫ్‌ను పొడిగించేందుకు భారత డ్రగ్స్ రెగ్యులేటర్ అనుమతించిన సంగతి తెలిసిందే.
Read Also : Covid-19 For jawans : 38 మంది కోబ్రా జవాన్లకు కరోనా పాజిటివ్