Einstein Stephen Hawking : ఐక్యూలో ఐన్‌స్టీన్‌, హాకింగ్‌లను మించిపోయిన చిన్నారి

ఇప్పటివరకు అత్యధిక ఐక్యూ(ఇంటెలిజెన్స్ కోషెంట్) ఉన్న వారి జాబితాలో ప్రముఖ శాస్త్రవేత్తలు అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, స్టీఫెన్‌ హాకింగ్‌లు ప్రథమ స్థానంలో ఉన్నారు. వీరి ఐక్యూ లెవల్స్‌ 160

Einstein Stephen Hawking

Einstein Stephen Hawking : ఇప్పటివరకు అత్యధిక ఐక్యూ(ఇంటెలిజెన్స్ కోషెంట్) ఉన్న వారి జాబితాలో ప్రముఖ శాస్త్రవేత్తలు అల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, స్టీఫెన్‌ హాకింగ్‌లు ప్రథమ స్థానంలో ఉన్నారు. వీరి ఐక్యూ లెవల్స్‌ 160 వరకు ఉన్నట్లు ప్రచారం ఉంది. అయితే, ఐక్యూ విషయంలో వీరిని మించిపోయింది మెక్సికన్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలిక. ఈ చిన్నారి ఐక్యూ ఏకంగా 162గా గుర్తించారు.

మెక్సికోకు చెందిన అధారా పెరెజ్ (8) అనే చిన్నారి మెక్సికోలోని తలాహుక్‌ మురికివాడ ప్రాంతంలో నివసిస్తూ ఉండేది. అయితే మూడేళ్ల ప్రాయంలో ఉండగా అధారా అస్పెర్జర్ సిండ్రోమ్‌ (ఆటిజం కోవకు చెందిన వ్యాధి) బారిన పడింది. ఫలితంగా డిప్రెషన్‌తో బాధపడుతుండేది. స్కూల్‌కు వెళ్లడానికి కూడా ఇష్టపడేది కాదు. ఈ క్రమంలో అధారా తల్లిదండ్రులు ఆమెను థెరపీ కోసం సైక్రియాట్రిస్ట్‌ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ అధారాను పరీక్షించిన డాక్టర్లు చిన్నారిలో అసమాన తెలివితేటలు ఉండటం గమనించారు.

COVID Vaccines : ఈ వ్యాక్సిన్లు ఎంతటి ఉష్ణోగ్రతనైనా తట్టుకుంటాయి..సరికొత్త కోవిడ్ టీకాలు

ఈ క్రమంలో అధారాను టాలెంట్‌ కేర్‌ సెంటర్‌కు తీసుకెళ్లమని సూచించారు. అక్కడ అధారా ఐక్యూని పరీక్షించగా.. 162గా తేలింది. ఇక టాలెంట్‌ కేంద్రంలో ఒకే రకమైన స్కిల్స్‌ ఉన్న విద్యార్థులను చేర్చుకుని వారికి చదువు చెప్తారు. ఈ క్రమంలో అధారాను అక్కడ చేర్చుకున్నారు.

Covid Vaccine.. మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపర్చగలదు.. ఎలాగంటే?

టాలెంట్‌ కేర్‌ సెంటర్‌లో చేరిన అధారా ఎనిమిదేళ్ల వయసు వచ్చే సరికే ఎలిమెంటరీ, మిడిల్‌, హై స్కూల్‌ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసింది. అంతేకాక రెండు ఆన్‌లైన్‌ డిగ్రీలు పొందింది. తన అనుభవాల గురించి తెలియజేస్తూ.. ‘డు నాట్‌ గివ్‌ అప్‌’ పేరుతో పుస్తకం కూడా రాసింది. ఇక మానసిక వైకల్యం ఉన్న వారి ఎమోషన్స్‌ని నిత్యం పరిశీలించేందుకు గాను ఓ స్మార్ట్‌ బ్రాస్‌లెట్‌ని అభివృద్ధి చేసింది. ఆస్ట్రోనాట్‌ అయి అంతరిక్షం వెళ్లాలని.. అంగారకుడిపై వలస రాజ్యం స్థాపించాలనేది అధారా కోరిక.