UHS : ఆ చిన్నారికి అందాన్ని తెచ్చిపెట్టిన..ప్రపంచంలో అరుదైన వ్యాధి
వ్యాధి బాధించటమేకాకుండా ప్రత్యేకతను అందాన్ని తెచ్చిపెడుతుందా? అంటే నిజమేననిపిస్తుంది ఈ చిన్నారులను చూస్తే..

Uncontrollable Hair Syndrome Baby
Uncontrollable Hair Syndrome : వ్యాధి బాధించటమేకాకుండా ప్రత్యేకతను అందాన్ని తెచ్చిపెడుతుందా? అంటే నిజమేననిపిస్తుంది ఈ చిన్నారులను చూస్తే..అది ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధి. దాని పేరు అన్‌కాంబెబుల్ హెయిర్ సిండ్రోమ్ (‘uncombable hair syndrome’). ఈ వ్యాధితో బాధపడేవారు ప్రపంచంలో కేవలం పది మంది మాత్రమే ఉంటారు. కానీ అదే వ్యాధి ఇద్దరు చిన్నారులకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలను చేసింది.
2021లో డేవిడ్ అనే బాలుడు యూహెచ్ఎస్ వ్యాధితో జన్మించాడు. దీని వల్ల అతని పొడవాటి కాపర్ కలర్ జుట్టుతో పుట్టాడు. ఆ బాలుడి తీసుకుని తల్లిదండ్రులు బయటకు వెళితే..ఆ బాలుడ్ని అందరు వింతగా చూసేవారు. యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ జుట్టులా ఉందే అంటుంటారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు తెలిపారు.
తాగాజాగా యూహెచ్ఎస్ సమస్యతో పుట్టిన ఓ చిన్నారి కూడా సోసల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ చిన్నారి పేరు లైలా డేవిస్. యూహెచ్ఎస్ సమస్యతో జన్మించింది. ఆమె తల వెంట్రుకలు, పొడిగా.. వెండి రంగులో గజిబిజిగా ఉన్నాయి. దువ్వుదామంటే కనీసం దువ్వెన పెట్టేందుకు కూడా వీలుండదు. లైలా ఫొటోలు, వీడియోలను ఆమె తల్లి షార్లెట్ ఇన్‌స్టాలో షేర్‌చేయటంతో అవి వైరల్ గా మారాయి. ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతు..పలు కామెంట్లు కురిపిస్తున్నాయి. లైలాను ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌లా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు బోరిస్ జాన్సన్‌తో పోలుస్తున్నారని షార్లెట్ తెలిపింది.