చెత్తకుప్పలో తిండి వెతుక్కొంటున్న ఏనుగుల మంద. కదిలించిన ఫోటోకి అవార్డ్ | Pallakaddu Elephants

ప్రకృతిలో వన్యప్రాణాలకు ఎంత హనిజరుగుతుందో కళ్లకు కట్టినట్టు చూపించిన ఫొటో ఇది.. వన్యప్రాణుల ప్రేమికులతో పాటు ప్రతిఒక్కరిని కదిలించిన చిత్రం.. అందుకే ఈ ఏడాదిలో రాయల్ సొసైటీ ఆఫ్ బయాలజీ (RSB) ఫోటోగ్రఫీ పోటీలో ఏనుగుల మంద (story Of Pallakaddu Elephants) ఫొటో ఫస్ట్ ప్రైజ్ గెల్చుకుంది.
శ్రీలంకలోని చెత్త డంప్ నుంచి తినే ఏనుగుల మంద ఫొటోకు మొదటి బహుమతి లభించింది. ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ Tilaxan Tharmapalan తన కెమెరాలో బంధించిన ఈ ఫొటో అంపారా జిల్లాలోని వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలోనిది.
అక్కడి ఏనుగుల దుస్థితిని వెలుగులోకి తీసుకొచ్చింది. ఇక్కడ ప్రతి సంవత్సరం వందలాది మంది ఏనుగులు వ్యర్థాలు తిని అనారోగ్యానికి గురై చనిపోతున్నాయి.
ఈ ఫొటోతో స్పందించిన అక్కడి అధికారులు ఏనుగులు సంచరించే ప్రదేశాల్లో చెత్తను వేయడాన్ని ఇప్పుడు నిషేధించారు. పోటీ కోసం ఎంపిక చేసిన అనేక ఫొటోలలో థర్మపాలన్ ఫొటోకు ప్రైజ్ మనీ దక్కింది. ఈ ఏడాదిలో ‘Our Changing World’ అనే థీమ్ తో నిర్వహించిన పోటీలో అతనికి 1,000 డాలర్లు (రూ.72వేలుపైనే) ప్రైజ్ మనీ గెలుచుకున్నారని బిబిసి నివేదించింది. ‘నేను ఈ అవార్డు గ్రహీత అయినందుకు గర్వపడుతున్నాను.
ఫోటోగ్రాఫర్లలో ఈ అవార్డు నా ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరుస్తుంది. నా భవిష్యత్ ప్రాజెక్టులకు మరిన్ని బాధ్యతలను ఇస్తుంది’ అంటూ ఫొటోగ్రాఫర్ ఫేస్‌బుక్ పోస్ట్‌లో Tharmapalan ట్వీట్ చేశారు. ఈ ఫొటోను షేర్ చేసిన తరువాత నెటిజన్ల నుండి ప్రశంసలను అందుకున్నారు. ఈ అవార్డుకు చాలా మంది అభినందనలు తెలియజేశారు.