Snake Viral Video : 4కోట్ల 80లక్షల వ్యూస్, 32లక్షల లైకులు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పాము

కాలిఫోర్నియాకు చెందిన రెప్టైల్ జూ ఫౌండర్ జే బ్రెవర్ షేర్ చేసిన పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వల్ప వ్యవధిలోనే ఆ వీడియోకి కోట్ల సంఖ్యలో

Snake Viral Video : 4కోట్ల 80లక్షల వ్యూస్, 32లక్షల లైకులు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పాము

Snake Viral Video

Updated On : June 26, 2021 / 12:57 PM IST

Snake Viral Video : కాలిఫోర్నియాకు చెందిన రెప్టైల్ జూ ఫౌండర్ జే బ్రెవర్ షేర్ చేసిన పాము వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. స్వల్ప వ్యవధిలోనే ఆ వీడియోకి కోట్ల సంఖ్యలో వ్యూస్, లక్షల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. నెటిజన్లు ఆ పాముని తెగ చూస్తున్నారు. విస్మయానికి గురవుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఆ పాము రంగు అందరిని అబ్బురపరుస్తోంది. రెయిన్ బో కలర్ లో ఆ పాము కనిపిస్తోంది.

జే బ్రెవర్ తన జూలోని జంతువుల వీడియోలు తీస్తుంటాడు. వాటిని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాడు. ఇదే క్రమంలో రెయిన్ బో కలర్ లో ఉండే పాము వీడియో షూట్ చేసి ఇన్ స్టాలో పెట్టాడు. రెండు వారాల క్రితం ఇన్ స్టాలో పెట్టాడు. అంతే.. ఒక్కసారిగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏకంగా 4 కోట్ల 80లక్షల వ్యూస్ వచ్చాయి. 32లక్షల మంది లైక్ కొట్టారు.

నమ్మశక్యం కాని రంగులో ఉన్న పాముని చూసి నెటిజన్లు స్టన్ అవుతున్నారు. వావ్ అని కొందరు, సో బ్యూటిఫుల్ అని మరికొందరు.. కొందరు కామెంట్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)