Former Pope Benedict XVI: వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో మాజీ పోప్ బెనెడిక్ట్ XVI అంత్యక్రియలు

మాజీ పోప్ బెనెడిక్ట్ XVI (95) అంత్యక్రియలు వాటికన్ లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో జరుగుతున్నాయి. వేలాది మంది ప్రజలు అంత్యక్రియలకు హాజరై సంతాపం తెలిపారు. క్యాథలిక్ సంప్రదాయ పద్ధతిలో జరుగుతున్న అంత్యక్రియల్లో పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడారు. జీసస్ చివరి పదాల్లోంచి.. ‘తండ్రీ.. నీ హస్తాలకు నా ఆత్మను అప్పగిస్తున్నాను’ అని పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు.

Former Pope Benedict XVI: వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో మాజీ పోప్ బెనెడిక్ట్ XVI అంత్యక్రియలు

Former Pope Benedict XVI

Updated On : January 5, 2023 / 3:22 PM IST

Former Pope Benedict XVI: మాజీ పోప్ బెనెడిక్ట్ XVI (95) అంత్యక్రియలు వాటికన్ లోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ లో జరుగుతున్నాయి. వేలాది మంది ప్రజలు అంత్యక్రియలకు హాజరై సంతాపం తెలిపారు. క్యాథలిక్ సంప్రదాయ పద్ధతిలో జరుగుతున్న అంత్యక్రియల్లో పోప్ ఫ్రాన్సిస్ మాట్లాడారు. జీసస్ చివరి పదాల్లోంచి.. ‘తండ్రీ.. నీ హస్తాలకు నా ఆత్మను అప్పగిస్తున్నాను’ అని పోప్ ఫ్రాన్సిస్ చెప్పారు.

బెనెడిక్ట్ XVI జీవితాన్ని దేవుడికి అప్పగించడానికి ఇంత మంది ప్రజలు వచ్చారని వ్యాఖ్యానించారు. ఇది వారి అపారప్రేమను సూచిస్తోందని చెప్పారు. కాగా, బెనెడిక్ట్ అనారోగ్య కారణాలతో ఇటీవల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. సుమారు పదేళ్ల క్రితం బెనెడిక్ట్ XVI పోప్ హోదాకు రాజీనామా చేశారు. ఆయన 2005, ఏప్రిల్ 19 నుంచి 2013 ఫిబ్రవరి 28 వరకు పోప్ గా కొనసాగారు.

గ్రెగొరీ XII 1415లో పోప్ హోదాకు రాజీనామా చేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆ హోదాకు రాజీనామా చేసిన మొదటి పోప్ గా బెనెడిక్ట్ XVI నిలిచారు. ఆయన పోప్ హోదాకు రాజీనామా చేసిన తర్వాతి నుంచి వాటికన్ హిల్ లోని మదర్ చర్చి మొనాస్టరీలో గడిపారు. జనవరి 2 నుంచి ఆయన పార్థివదేహాన్ని సెయింట్ పీటర్స్ బసిలికాలో దర్శనానికి ఉంచారు. కాగా, జర్మనీలో 1927, ఏప్రిల్ 16న బెనెడిక్ట్ XVI జన్మించారు. 78 ఏళ్ల వయసులో పోప్ అయ్యారు.

Gun Fire In USA : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఎనిమిది మంది మృతి