Hotel Bill
Hotel Bill : ఎంత పెద్ద హోటలైనా.. మూడు వేలు పెడితే కడుపు నిండా తిండి పెడతారు. కొన్ని చోట్ల రూ. 100 నుంచి రూ. 500 మద్యే మంచి ఆహారం కడుపునిండా లభిస్తుంది. చికెన్, మటన్, ఫిష్ బిర్యానీ తిన్నా.. రూ. 3,000 బిల్ అవదు.
అయితే ఆకలితో హోటల్ లో అడుగుపెట్టిన ఓ మహిళ మిల్స్ ఆర్డర్ చేసింది. దానికి భారత కరెన్సీలో రూ.3,000 బిల్ అయింది. తీరా వచ్చాక చూస్తే అది చిన్నపిల్లలకు కూడా సరిపోయేలా లేదు. ఓ ప్లేట్ లో ఓ ఆఫ్ బ్రెడ్ ముక్క పరిమాణంలో ఉన్న ఆహారం, దాని పక్కన కొంచం సాస్, ఉంది. అది చూసి ఆమె ఒక్కసారిగా షాక్ కి గురైంది. బిల్లు చూస్తే జేబుకు చిల్లు పడేలా ఉంది.. ఫుడ్ చూస్తే సగం ఆకలి కూడా తీరేలా లేదు.
కాగా ఈ ఘటన లండన్‌లోని ఫేమస్ బిల్డింగ్ షార్డ్‌లోని హోటల్‌లో చోటు చేసుకుంది. ఆ మహిళ.. అంత ఖర్చుపెట్టినా కూడా తన కడుపు నిండకపోయేసరికి.. కడుపు మండి.. తనకు తీసుకొచ్చిన ఆ అతి అల్పాహారాన్ని ఫోటో తీసి తన ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసింది. దీంతో నెటిజన్లు ఆ ఫోటోను చూసి నోరెళ్లబెడుతున్నారు.
ఫుడ్ మెను చూసి మోసపోవద్దని.. మెను కార్డును కాకుండా.. సరసమైన ధరల్లో లభించే బెస్ట్ ఫుడ్ ఏంటో ముందే తెలుసుకోవాలని.. లేకపోతే.. ఇలాగే జరుగుతుందని నెటిజన్లు.. ఆమహిళకు సలహాలు ఇస్తున్నారు. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంగ్లాండ్ కరెన్సీలో ఇది 30 పౌండ్లుగా ఉంది.