OMG : లైవ్‌లో పిడుగు

  • Published By: madhu ,Published On : May 12, 2019 / 11:09 AM IST
OMG : లైవ్‌లో పిడుగు

Updated On : May 12, 2019 / 11:09 AM IST

వర్షాలు పడేటప్పుడు… ఆకాశంలో ఉరుములు.. మెరుపులు, పిడుగులు పడడం సహజం. భారీ శబ్దాలతో ఉరుములు.. కళ్లు మిరిమిట్లు గొలిపే కాంతితో మెరుపులు మెరుస్తూ ఉంటాయి. ఇక పిడుగులు ఎక్కడ పడితే.. అక్కడ కాలి బూడిదవ్వడం ఖాయం.  ఫ్లోరిడాలో మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. మామూలుగా పడే దానికన్నా…. పది రెట్లు ఎక్కువ శక్తితో పిడుగు భూమిని చేరింది. ఇళ్ల మధ్యలో పడినా.. ఎటువంటి నష్టం జరగలేదు. ఆ అద్బుత దృశ్యాన్ని తన సెల్‌ఫ్లోన్‌లో బంధించిందో మహిళ. 

ఫ్లోరిడాలోని బాయిన్‌టన్ బీచ్‌ లో కుంభవృష్టిగా వర్షం కురుస్తోంది. పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌లో ఉండే ఎరికా హైట్ ఆ దృశ్యాలను తన సెల్‌ఫోన్లో చిత్రీకరిస్తోంది. ఇంతలో చెవులు చిల్లులు పడేంత శబ్దంతో.. భారీ పిడుగు పడింది. ఆమె ఒక్కసారిగా భయపడిపోయింది. తన జీవితంలో అటువంటి భయంకర దృశ్యాన్ని చూడలేదని తెలిపింది.

ఎరికా హైట్ చిత్రీకరించిన దృశ్యాన్ని.. మియామీలోని ది నేషనల్ వెదర్ సర్వీస్‌ అనాలసిస్ చేసింది. దానిని పాజిటివ్‌ లైటింగ్‌గా అభివర్ణించింది. ఇది సాధారణంగా పడే పిడుగుల కంటే.. 10రెట్లు ఎక్కవ శక్తిని కలిగిఉందని తెలిపింది. పాజిటివ్ లైటింగ్..లో నెగిటివ్ లైటింగ్ కంటే ఎక్కువ ఎనర్జీ ఉందని, అది ఒక బిలియన్ వోల్ట్స్ శక్తిని కలిగి ఉందని తెలిపింది. దాని శబ్దం మూడు లక్షల యాంప్స్‌తో సమానమని పేర్కొంది. నిజానికి ఆమె ఇంట్లో ఉంది కాబట్టి బతికిపోయింది.