The BeeVi Toilet : వాడితే డబ్బులు ఇచ్చే టాయ్‌లెట్‌..!!

సాధారణంగా మనం బయటకు వెళ్లినప్పుడు టాయ్‌లెట్‌ (పబ్లిక్ టాయ్‌లెట్స్) ఉపయోగిస్తే డబ్బులివ్వాలి. బస్టాండ్ లోను..బయట ధాబాలు వంటిచోటికి వెళితే టాయ్‌లెట్‌ అవసరం అయితే డబ్బులివ్వాల్సి ఉంటుంది. కానీ ఓ టాయ్‌లెట్‌ ఉపయోగిస్తే డబ్బులు ఇవ్వక్కరలేదు..పైగా మనకే ఎదురు డబ్బులిస్తారు.

The BeeVi Toilet : వాడితే డబ్బులు ఇచ్చే టాయ్‌లెట్‌..!!

Giving Money ‘the Beevi Toilet’

Updated On : July 10, 2021 / 1:19 PM IST

Giving Money ‘The BeeVi toilet’ : సాధారణంగా మనం బయటకు వెళ్లినప్పుడు టాయ్‌లెట్‌ (పబ్లిక్ టాయ్‌లెట్స్) ఉపయోగిస్తే డబ్బులివ్వాలి. బస్టాండ్ లోను..బయట ధాబాలు వంటిచోటికి వెళితే టాయ్‌లెట్‌ అవసరం అయితే డబ్బులివ్వాల్సి ఉంటుంది. అక్కడే కూర్చున్న మనిషి డబ్బులిస్తేనే గానీ లోపలికి పోనీయడు. కానీ దక్షిణా కొరియాలో మాత్రం టాయ్‌లెట్‌ ఉపయోగిస్తే డబ్బులు ఇవ్వక్కరలేదు..పైగా మనకే ఎదురు డబ్బులిస్తారు. ఆ టాయ్‌లెట్‌లో ఓ క్యూర్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే డబ్బులు నేరుగా మీ అకౌంట్‌లో వచ్చి పడతాయి. ఏంటీ నమ్మాలనిపించట్లేదు కదూ..నిజమే. కానీ అలా ఉపయోగించిన టాయ్‌లెట్‌లోని మానవ వ్యర్ధాలను వేరే దానికి ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ పద్ధతిని ఏర్పాటు చేశారు దక్షిణకొరియాలో. మరి డబ్బులిచ్చే ఆ టాయ్‌లెట్‌ గురించి తెలుసుకోవాలి ఉందికదూ..

దక్షిణ కొరియాలోని ఉల్సాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పనిచేసే అర్బన్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ చో జై-వూన్ ఆ టాయ్‌లెట్‌ను రూపొందించారు. ఆ టాయ్‌లెట్ మానవ వ్యర్థాలతో విద్యుత్‌ను తయారు చేస్తుంది. ఈ వింత టాయ్‌లెట్‌ పేరు `ది బీవి టాయ్‌లెట్`(The BeeVi toilet). ఆ టాయ్ లెట్ ఉపయోగించిన మానవ వ్యర్థాలను టాయ్‌లెట్ ద్వారా ఒక ట్యాంక్‌లోకి వెళ్లేలా చేస్తారు. వాటికి కొన్ని రకాల సూక్ష్మజీవులను ఊపయోగించి మానవ వ్యర్థాలను మీథేన్‌గా మారుస్తారు. ఆ మీథేన్ సహాయంతో హాట్ బాయిలర్, గ్యాస్ స్టవ్, ఇతర ఎలక్ట్రానిక్ వంటి పరికరాలకు విద్యుత్ ను అందించవచ్చు.

`50 లీటర్ల మీథేన్ 0.5 కిలో వాల్టుల విద్యుత్తును తయారు చేస్తుంది. దాని సహాయంతో 1.2 కిలో మీటర్లు కారును డ్రైవ్ చేయవచ్చు. అలాగే ఎన్నో విద్యుత్ పరికరాలకు శక్తిని అందించవచ్చ`ని జై-వూన్ తెలిపారు. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్న ఈ టాయ్‌లెట్‌ను ఉపయోగించడం ద్వారా విద్యార్థులు వర్చువల్ కరెన్సీని పొందవచ్చు.కాగా..ఓ వ్యక్తి సగటున రోజుకు 500 గ్రాముల మలవిసర్జన చేస్తాడు. దీనిని 50 లీటర్ల మీథేన్ వాయువుగా మార్చవచ్చని పర్యావరణ ఇంజనీర్ తెలిపారు. దీని ద్వారా తయారు అయిన గ్యాస్ 0.5 కిలోవాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగలదు లేదా 1.2 కిలోమీటర్ల (0.75 మైళ్ళు) కారును నడపడానికి ఉపయోగించవచ్చని తెలిపారు. అలా టాయ్ లెట్ ఉపయోగించగా వచ్చిన డబ్బులతో కాఫీకి చెల్లించవచ్చు. లేదా అరటిపండ్లు కొనుక్కోవచ్చని అంటున్నారు. అంటే వాటికి సరిపడా డబ్బులొస్తాయి అని.