Torn Sweater
Torn Sweater : వచ్చేది చలికాలం.. చలిని తట్టుకునేందుకు చాలామంది స్వెటర్లు కొనుకుంటారు. కొందరు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కి వెళ్లి కొంటే, మరికొందరు మాత్రం ఏవో తమకు అందుబాటు ధరలో లభించే చిన్న దుకాణాలకు వెళ్లి కొంటుంటారు. అయితే సీజన్ ను బట్టి కొన్ని కంపెనీలు కొత్త డిజైన్ లతో మార్కెట్లోకి వస్తుంటాయి. ఆ డిజైన్స్ చూడటానికి చెత్తగా ఉన్న ధర మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది.
టాన్ జీన్స్ వస్త్ర రంగంలో ట్రెండ్ క్రేయేట్.. మార్కెట్లోకి వచ్చిన మొదట్లో చాలామంది ఈ రకమైన దుస్తులపై విమర్శలు గుప్పించారు. బెగ్గర్ జీన్స్ అని పేరు పెట్టారు. కానీ ఆ తర్వాత వాటిని కొనేందుకు ఎగబడ్డారు. అతుకులాతుకులుగా ఉండే ఈ జీన్స్ కేవలం ప్యాంట్లలోనే కాకుండా షర్ట్స్, స్వెటర్స్ లో కూడా వస్తుంది. తాజాగా ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ బాలెన్‌సియాగా ‘డిస్ట్రాయిడ్ క్రూనెక్’ పేరుతో కొత్తరకం స్వెటర్లను విడుదల చేసింది. ఇది అచ్చం కోపం వచ్చిన కుక్క కోరికేసింది వస్త్రంలా ఉంది. వంద శాతం ఉన్నితో తయారు చేసిన వీటి డిజైన్, అచ్చం ఎలుకలు కొరికితే చిల్లులు పడిన స్వెటర్‌లాగే ఉంటుంది.
చూడటానికి వికారంగా ఉన్నా ఒక్కసారి మన కుర్రకారుకు ఇది నచ్చితే దీని మార్కెట్ ఓ రేంజ్ లో ఉంటుంది. అయితే గుడ్డపేలికలతో కుట్టినట్లు ఉన్న ఈ స్వెటర్ ధర కాసింత ఎక్కువ.. కాసింత అంటే అంతా ఇంతా కాదు.. దీని ధర భారత కరెన్సీలో లక్షకు పైమాటే. ఈ చిల్లుల స్వెటర్ ధర 1,450 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.1,07,652 పలుకుతుంది మరి!