ఆల్ఫా జనరేషన్‌కు గుడ్ బై.. ఇక బీటా జనరేషన్‌కు హలో చెప్పండి.. ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
కొత్త తరం ప్రారంభమవుతుంది. 2035 నాటికి బీటా జనరేషన్‌లోని పిల్లలు ప్రపంచ జనాభాలో 16 శాతంగా ఉంటారు. అంటే 106 కోట్ల మంది వారే.

Beta Generation: మరో రెండు వారాల్లో 2024 ముగియనుంది. 2024 ఆల్ఫా జనరేషన్‌కి చివరి సంవత్సరం. 2013 నుంచి 2024 మధ్య పుట్టిన వారిని ఆల్ఫా జనరేషన్ అంటారు. వచ్చే ఏడాది (2025) నుంచి బీటా జనరేషన్ ప్రారంభం కానుంది. 2025 నుంచి 2040 మధ్యలో పుట్టిన వారిని బీటా జనరేషన్‌కు చెందిన వారని పిలుస్తారు.
జనరేషన్లు ఇలా..
- ది గ్రేటెస్ట్ జనరేషన్ (1901-1927)
- ది సైలెంట్ జనరేషన్ (1928-1945)
- బేబీ బూమర్స్ (1946-1964)
- జెన్ ఎక్స్ (1965-1980)
- జెన్ వై/మిలీనియల్స్ (1981-1996)
- జెన్ జెడ్ (1997-2012)
- జనరల్ ఆల్ఫా (2013-2024)
- జెన్ బీటా (2025-2040)
ఆల్ఫా జనరేషన్ మరికొన్ని రోజుల్లో ముగుస్తుండడంతో జెన్ బీ గురించి ఆసక్తి నెలకొంది. బీటా జనరేషన్‌లో జన్మించిన వారు మనకు తెలిసిన దానికంటే చాలా భిన్నమైన ప్రపంచంలో పెరుగుతారు. ఇటీవలి కాలం ‘జనరేషన్’ అనే పదం తరచుగా వినపడుతోంది.
ఒకే విధమైన సంస్కృతులు, సామాజిక, చరిత్ర ఉండే నిర్దిష్ట సమయాల్లో పుట్టే వారిని ఒక్కో ‘జనరేషన్’గా వ్యవహరిస్తుంటారు. 2025 నుంచి కొత్త తరం ప్రారంభమవుతుంది. 2035 నాటికి బీటా జనరేషన్‌లోని పిల్లలు ప్రపంచ జనాభాలో 16 శాతంగా ఉంటారు. అంటే 106 కోట్ల మంది వారే.
జనరేషన్ బీటాలో పుట్టే వారికి ముఖ్యంగా టెక్‌పై అవగాహన అధికంగా ఉంటుంది. వైవిధ్యభరిత వాతావరణంలోనూ పెరుగుతారు. బీటా జనరేషన్ వారు మిలీనియల్స్ లేదా జెన్ ఎక్స్ తరం వారికి పిల్లలుగా పుడతారు. ఆల్ఫా జనరేషన్‌లో పుట్టిన చాలా మందికి 22వ శతాబ్దాన్ని చూడే అవకాశాలు ఉన్నాయి. ఆల్ఫా జనరేషన్ వారు ఏఐని అధికంగా వాడే అవకాశం ఉంది.