Find Actor : ఈ ఫొటోలో క్యూట్ పాపాయి గెటప్ లో ఉన్నది ఎవరో తెలుసా? మెగా హీరో.. చిన్నప్పుడు ఇలా అమ్మాయిగా..
ఇంతకీ ఈ ఫొటోలో క్యూట్ పాపాయి గెటప్ లో ఉన్నది ఎవరో తెలుసా?

Find The Actor Childhood Lady Getup Photo of Mega Hero
Find Actor : అప్పుడప్పుడు మన సెలబ్రిటీల చిన్నప్పటి ఫొటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. చాలా మంది అబ్బాయిలకు చిన్నప్పుడు అమ్మ గౌన్ వేసి అమ్మాయిలా తయారుచేసి మురిసిపోతారు. అలాగే ఓ మెగా హీరో తల్లి తన కొడుకుకి చిన్నప్పుడు ఇలా అమ్మాయి గెటప్ వేసి మురిసిపోయింది. ఆ మెగా హీరోకి సంబంధించి తాజాగా జరిగిన సినిమా ఈవెంట్లో ఈ చిన్నప్పటి ఫొటో బయటపెట్టడంతో ఇది వైరల్ గా మారింది.
Also See : Mahesh Babu Family : మంచు పర్వతాల్లో మహేష్ ఫ్యామిలీ.. జర్మనీ వెకేషన్ ఫొటోలు చూశారా?
ఇంతకీ ఈ ఫొటోలో క్యూట్ పాపాయి గెటప్ లో ఉన్నది ఎవరో తెలుసా? మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్. సాయి తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సంబరాల ఏటిగట్టు సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ ఈవెంట్ కు రామ్ చరణ్ గెస్ట్ గా వచ్చాడు. అలాగే సాయి తేజ్ తల్లి తండ్రలు కూడా వచ్చారు. ఈ ఈవెంట్లో స్టేజిపై ఈ ఫొటో చూపించి యాంకర్ సుమ దీని గురించి సాయి తేజ్ ని ప్రశ్నించింది.
సాయి దుర్గా తేజ్ ఆ ఫొటో గురించి మాట్లాడుతూ.. ప్రతి ఒక్క అబ్బాయిని చిన్నప్పుడు అమ్మాయిలా తయారుచేయాలని అమ్మలు అనుకుంటారు. నేను ఇలా ఎందుకు చేసావని అడిగితే ప్రతి ఒక్కరికి కూతురు కూడా ఉండాలి. నీకు ఇలా గెటప్ వేసి కూతురిలా చూసుకున్నాను. అలాగే సొంత ఇంట్లోనే కాదు బయట అమ్మాయిలకు కూడా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి అని చెప్పింది అంటూ తెలిపారు. దీంతో ప్రస్తుతం సాయి దుర్గా తేజ్ చిన్నప్పటి ఈ క్యూట్ ఫొటో వైరల్ గా మారింది.