Guinness World Records : 93 వ పుట్టినరోజు జరుపుకున్న ట్రిప్లెట్స్.. గిన్నిస్ రికార్డ్ సాధించిన సోదరులు

USA కి చెందిన ముగ్గురు సోదరులు (ట్రిప్లెట్స్).. వయసు 93 ఏళ్లు. ఎంతో అన్యోన్యంగా, ఆరోగ్యంగా జీవిస్తున్న ఈ సోదరులు ఇటీవల గిన్నిస్ రికార్డ్ సాధించారు.

Guinness World Records

Guinness World Records : USA కి చెందిన ముగ్గురు సోదరులు (ట్రిప్లెట్స్) తమ 93 వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ముగ్గురు ప్రపంచంలోనే అత్యంత వృద్ధులైన ట్రిప్లెట్స్‌గా గిన్నిస్ రికార్డు సాధించారు. అసలు వారి ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసుకుందామా?

Anchor Suma : యాంకర్ సుమ తాతయ్య గిన్నిస్ బుక్ అఫ్ రికార్డు.. ఎందుకో తెలుసా..?

లారీ ఆల్డెన్ బ్రౌన్, లోన్ బెర్నార్డ్ బ్రౌన్, జీన్ కరోల్ బ్రౌన్ ముగ్గురు ట్రిప్లెట్స్. USA కాన్సాస్‌లోని కల్వెస్టాకు చెందిన వీరు 1930 లో పుట్టారు. డిసెంబర్ 1 న పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న ముగ్గురు ప్రపంచంలోని అత్యంత వృద్ధులైన ట్రిప్లెట్స్ (మగవారు) గా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. లారీ ఆల్డెన్ బ్రౌన్, లోన్ బెర్నార్డ్ బ్రౌన్, జీన్ కరోల్ బ్రౌన్ లు చిన్నప్పటి నుంచి ఎంతో సన్నిహితంగా ఉండేవారట. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి చెడు అలవాట్లు లేవట. మంచి స్నేహితులుగా ఉండటమే కాదు.. ఒకరి విషయంలో ఒకరు కేర్ తీసుకుంటూ ఉండేవారట. తాజాగా guinnessworldrecords యాజమాన్యం తమ సోషల్ మీడియా ఖాతాలో వీరి చిన్ననాటి ఫోటోలతో పాటు లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది.

Ayodhya Deepotsav : అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం.. సరయూ నదీ తీరంలో 51 ఘాట్ లలో 24 లక్షల దీపాలు.. ప్రపంచ గిన్నిస్ రికార్డు

ముగ్గురు సోదరులు గతేడాది 92 వ పుట్టినరోజు గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకకు కుటుంబ సభ్యులంతా కలిసారు. వీరికి నలుగురు అన్నలు, ముగ్గురు తమ్ముళ్లు, ఒక సోదరి ఉండేవారట. అందరూ చనిపోయారట. కానీ వారి సంతానం 9 మంది పిల్లలు, 20 మంది మనవలు, 25 మంది మనవరాళ్లు ఉన్నారట. ఈ ట్రిప్లెట్స్‌కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ముగ్గురు తాతయ్యలకు అభినందనలు.. పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ట్రెండింగ్ వార్తలు