Ayodhya Deepotsav : అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం.. సరయూ నదీ తీరంలో 51 ఘాట్ లలో 24 లక్షల దీపాలు.. ప్రపంచ గిన్నిస్ రికార్డు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలోని శ్రీరామ జన్మభూమి పథ్ వద్ద శనివారం రాత్రి భారీ దీపోత్సవం జరగనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అయోధ్య దీపోత్సవంలో భాగంగా 24 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.....

Ayodhya Deepotsav : అయోధ్యలో అంగరంగ వైభవంగా దీపోత్సవం.. సరయూ నదీ తీరంలో 51 ఘాట్ లలో 24 లక్షల దీపాలు.. ప్రపంచ గిన్నిస్ రికార్డు

Ayodhya Deepotsav

Ayodhya Deepotsav : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలోని శ్రీరామ జన్మభూమి పథ్ వద్ద శనివారం రాత్రి భారీ దీపోత్సవం జరగనుంది. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అయోధ్య దీపోత్సవంలో భాగంగా 24 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు నెలకొల్పాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం రాత్రి పవిత్ర అయోధ్య నగరంలో ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించనున్నారు.

దీపాలతో కోలాహలంగా సరయూ నదీతీరం 

శనివారం సాయంత్రం సరయు నదీ తీరం వెంట వైభవంగా దీపోత్సవం,లేజర్ షో నిర్వహించడానికి అన్నీ ఏర్పాట్లు చేశారు. సరయూ నదీ తీరంలోని 51 ఘాట్‌ల వద్ద 24 లక్షల దీపాలు ఏర్పాటు చేశారు. ఈ దీపోత్సవానికి రామ్ మనోహర్ లోహియా అవధ్ యూనివర్సిటీ భారీ ఏర్పాట్లు చేసింది. 24 లక్షల మట్టి దీపాలతో రంగవల్లులు,పూలతో గిన్నిస్ రికార్డు నెలకొల్పేలా దీపోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈసారి ప్రత్యేకంగా జార్ఖండ్‌లోని పాకూర్ జిల్లాకు చెందిన గిరిజనులతో సహా వివిధ ప్రాంతాల ప్రజలు ఈ దీపోత్సవాన్ని వీక్షించనున్నారు.

దీపోత్సవంలో పాల్గొననున్న గిరిజనులు

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో జార్ఖండ్ గిరిజనులు దీపాలు వెలిగించనున్నారు. ఈ దీపోత్సవంలో పాల్గొనడానికి చెప్పులు లేకుండా జార్ఖండ్ గిరిజనులు అయోధ్యకు చేరుకున్నారు. జార్ఖండ్ ప్రదేశ్ శ్రీ రామ్ జానకి ఛారిటబుల్ సర్వీస్ ట్రస్ట్ అద్వర్యంలో దీప ఉత్సవంలో గిరిజనులు పాల్గొననున్నారు.

రామాలయం ప్రారంభం నేపథ్యంలో…

2022వ సంవత్సరంలో దీపావళి సందర్భంగా అయోధ్యలో 15 లక్షల 76వేల దీపాలను వెలిగించారు. అయోధ్యలోని 51 ఘాట్లలో శనివారం జరగనున్న దీపోత్సవంలో 25 వేలమంది వాలంటీర్లు పాల్గొననున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రామాలయం నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ ఏడాది దీపావళి దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.