Donald Trump : వెనెజువెలాపై దాడి సమయంలో అమెరికా రహస్య ఆయుధం ప్రయోగించిందా?

Donald Trump : వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించే సమయంలో అమెరికా సైన్యం రహస్య సోనిక్ ఆయుధాన్ని ఉపయోగించిందన్న ఆరోపణలపై డొనాల్డ్ ట్రంప్ స్పందించారు.

Donald Trump : వెనెజువెలాపై దాడి సమయంలో అమెరికా రహస్య ఆయుధం ప్రయోగించిందా?

Donald Trump

Updated On : January 22, 2026 / 10:59 AM IST
  • వెనెజువెలాపై దాడిలో రహస్య ఆయుధం వాడాం
  • ధ్రువీకరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
  • ఈ తరహా శక్తిమంతమైన ఆయుధం తమవద్దే ఉందన్న ట్రంప్

Donald Trump : వెనెజువెలా అధ్యక్షుడు (Venezuela President) నికోలస్ మదురో (Nicolas Maduro) ను బంధించే క్రమంలో అమెరికా దళాలు సీక్రెట్‌ సోనిక్‌ వెపన్‌‌ను  ప్రయోగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలుసైతం వచ్చాయి. ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు.

Also Read : మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్‌.. కాల్పుల కలకలం

అమెరికా దాడి జరిపిన సమయంలో మదురో రక్షణ సిబ్బందిలోని ప్రత్యక్షసాక్షి మాటల ప్రకారం.. దాడి సమయంలో అమెరికా దళాలు ఏదో ఆయుధాన్ని ప్రయోగించాయి. బహుశా అది తీవ్రశబ్ద తరంగం కావచ్చు. అది విన్న తరువాత నా తల పేలిపోతుందేమో అనిపించింది. నా ముక్కు వెంట రక్తం కారడం ప్రారంభించింది. మిగిలిన వారందరిదీ అదే పరిస్థితి. మాలో కొందరు రక్తపు వాంతులు చేసుకున్నారు. మేమంతా నేలపై పడిపోయాం. కదలలేక పోయాం అని చెప్పుకొచ్చాడు. మదురో రక్షణ సిబ్బందిలోని మిగిలిన వారు కూడా ఇదే వాదనను వినిపించారు. దీంతో వెనెజువెలాపై మెరుపుదాడి సమయంలో అమెరికా ఓ రహస్య ఆయుధాన్ని ఉపయోగించినట్లు ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతుంది.

వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించే సమయంలో అమెరికా సైన్యం సీక్రెట్‌ సోనిక్‌ వెపన్‌‌‌ను ఉపయోగించిందని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించాడు. ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికా సైనిక శక్తిని ప్రశంసిస్తూనే మరెవరి వద్దా ఈ ఆయుధం లేదని ట్రంప్ చెప్పుకొచ్చాడు.